Site icon NTV Telugu

Gudem Mahipal Reddy: నేడు పీసీసీ కమిటీ ముందు హాజరు కానున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి!

Pcc

Pcc

Gudem Mahipal Reddy: పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ లో పంచాయతీకి ఇంకా పులిస్టాప్ పదానిట్లు కనబడలేదు. విషయం కాస్త గాంధీభవన్ కు చేరుకున్న సమస్య ఇంకా తీరలేదు. పీసీసీ కమిటీ ముందు కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ హాజరుకాగా.. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నేతలను వేధించిన అధికారులను ప్రాధాన్యత ఇస్తున్నారని శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. నియోజకవర్గం లోని కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై కాట శ్రీనివాస్ నివేదిక సమర్పించారు.

Also Read: RAM : యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసిన డిజాస్టర్ సినిమా

పటాన్ చెరు ప్రాంతంలో అధికారిక కార్యక్రమాలు జరుగుతున్న బిఆర్ఎస్ నాయకులకు సమాచారాన్ని అధికారులు ఇస్తున్నారని, అందుకు సంబంధించిన ఫోటోలను కాట శ్రీనివాస్ కమిటీకి సమర్పించారు. అయితే సోమవారం నాడు సమావేశానికి రాలేనని చెప్పిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇవాళ కమిటీ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మంత్రి రాజా నరసింహ, జగ్గారెడ్డితో కూడా కమిటీ భేటీ కానుంది.

Exit mobile version