Congress: ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. తెలంగాణలో విజయం తర్వాత ఏపీపై రాహుల్ గాంధీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏపీలో కూడా పుంజుకుని పునరుత్తేజం వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా పయనించేందుకు గానూ ఏపీలోని కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతోంది కాంగ్రెస్ అధిష్ఠానం. అందుకోసం అడపాదడపా సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నెల 27న కాంగ్రెస్ అధిష్ఠానంతో ఏపీ కాంగ్రెస్ నేతల కీలక భేటీ జరగనుంది.
Read Also: Merugu Nagarjuna: రానున్న ఎన్నికల్లో టీడీపీ రథచక్రాలు ఊడడం ఖాయం.. ప్రజలంతా జగన్ వైపే..
ఈ సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్, సీడబ్ల్యుసీ సభ్యుడు రఘువీరా రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, చింతా మోహన్, కొప్పుల రాజు, జేడీ శీలం తదితర సీనియర్ నాయకులు హాజరుకానున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏపీ పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో ఏపీ సీనియర్ కాంగ్రెస్ నేతలంతా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఏపీలో పొత్తులపై నిర్ణయం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజం చేసేలా అధిష్ఠానం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
