NTV Telugu Site icon

TPCC Post: తెలంగాణకు కొత్త పీసీసీ నియామకంపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు..

Pcc

Pcc

TPCC Post: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీకాలం నేటితో ముగిసిపోయింది. దీంతో నూతన పీసీసీ నియామకంపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇవాళ సాయంత్రం అధిష్టాన పెద్దలతో భేటి కానున్న రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు.. పదవీ కాలం పూర్తి కావడంతో పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని అధిష్టానాన్ని రేవంత్ రెడ్డి కోరారు. సామాజిక సమీకరణాలు, సమర్థవంతమైన నాయకుడికి పీసీసీ అధ్యక్షునిగా ఎంపిక చెయ్యాలని అధిష్టానానికి చెప్పినట్లు తెలుస్తుంది. 2021 జూన్ 27న పీసీసీగా నియామకమైన రేవంత్ రెడ్డి.. మూడేళ్ళ పాటు పీసీసీగా తనకిచ్చిన బాధ్యతలు సంపూర్ణంగా నెరవేర్చినట్లు పేర్కొన్నారు.

Read Also: AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీపై సిఎస్ నీరభ్ కుమార్ సమీక్ష..

ఇక, పీసీసీగా ఎవరిని నియమించాలనేది కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అధ్యక్షుడి నియామకంపై నాకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏది లేదు.. అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి పని చేయడమే నా బాధ్యత అన్నారు. నా పదవి కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి పని తీరు కనబరిచాం.. అసెంబ్లీ ఎన్నికల కంటే కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది అని చెప్పుకొచ్చారు. కాగా, ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు.