NTV Telugu Site icon

Damodara Raja Narasmiha : పేదవాని వైద్యం, విద్య మా బాధ్యతగా భావించేది… కాంగ్రెస్ పార్టీ..

Damodara Raja Narasimha

Damodara Raja Narasimha

Damodara Raja Narasmiha : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆరోగ్య ఉత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు సీఎం రేవంత్‌ రెడ్డి. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. పేదవాని వైద్యం, విద్య మా బాధ్యతగా భావించేది… కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం 5లక్షల నుంచి 10 లక్షల కు పెంచామని, 1,375 ప్రోసీజర్లకు ధరలను 22శాతం కి పెంచామని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యం సబ్ సెంటర్లు, PHC, ఏరియా హాస్పిటల్స్ , మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు … 500 కోట్ల రూపాయలు విడుదల చేసిన చరిత్ర కాంగ్రెస్ దే అని ఆయన అన్నారు.

Aadi Srinivas : కాళేశ్వర రావు ఇప్పుడు కూలేశ్వర రావు గా మారిపోయారు

2 వేల కోట్ల రూపాయలు లతో కొత్త ఉస్మానియా దవాఖానా కు శంకుస్థాపన చేసుకోబోతున్నామని, క్యాన్సర్, డయాబెటీస్, బీపీ, వంటి దీర్ఘకాలిక వ్యాధులను కట్టడి చేసేందుకు ఆయా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు దామోదర రాజనర్సింహ. అంతేకాకుండా..గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలకు హాస్టల్స్ కి శంకుస్థాపన చేసుకున్నామని ఆయన తెలిపారు. పేదవారికి వైద్యం కోసం అప్పులపాలు కావొద్దు అనేది మా లక్ష్యం అని ఆయన అన్నారు. ఇవ్వాళ ప్రారంభించిన 213 అంబులెన్స్ లతో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం… 20 నిమిషాల నుంచి 13 నిమిషాలకు చేరుకుందని, 80 ట్రామ సెంటర్లు ఏర్పాటుకు సిద్ధం అవుతున్నామని ఆయన వెల్లడించారు.

Mythri Movie Makers: పుష్ప 2 రిలీజ్ ముంగిట.. మైత్రీ మేకర్స్ వ్యూహాత్మక నిర్ణయం