Farmers Loan: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచింది. దీంతో పాటు త్వరలోనే 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ఏర్పాట్లు కొనసాగుతుంది. అయితే, కాంగ్రెస్ సర్కార్ రైతులకు మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమవుతుంది.
Read Also: IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. కేఎల్ రాహుల్ దూరం! దేవ్‌దత్ పడిక్కల్‌కు అవకాశం
అయితే, రైతు భరోసా కింద ఎకరాకు 15 వేల రూపాయలు ఇస్తామని తెలిపింది. అలాగే రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పుకొచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా రుణమాఫీ చేస్తామని రైతన్నలకు హామీ ఇచ్చింది. ఒకేసారి 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాల్ని మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని త్వరలోనే క్లీయర్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే, రైతు రుణ మాఫీపై గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
Read Also: Chalo Nalgonda: నేడు నల్గొండలో బీఆర్ఎస్ సభ.. రైతు గర్జన సభకు కేసీఆర్
ఇక, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి రైతుల రుణమాఫీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాజాగా రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి వెల్లడించారు. అధికారులు రైతుల అప్పుల వివరాలను సేకరించే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పుల వివరాలు పూర్తి కాగానే రుణమాఫీ చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో అక్రమంగా భూములు తీసుకున్న అధికారులపై విచారణ చేయాలని ధరణి కమిటీ సభ్యుడు కోదండ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే, రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్ కింద 500 రూపాయలు ఇస్తాం.. వరి పంటకు మద్దతు ధర ప్రస్తుతం 2060 రూపాయలుగా ఉంది.. దానికి 2600 రూపాయలు చెల్లిస్తామని కోదండరెడ్డి చెప్పారు.