కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఈఓ వికాస్ రాజ్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ఓటు వేసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ పేరును ప్రస్తావించినందుకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. పోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది. కిషన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని ఈసీని కాంగ్రెస్ కోరింది.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ఉదయమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బర్కత్‌పురాలోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. కిషన్ రెడ్డి సతీమణి కూడా బర్కత్‌పురాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
