Mallikarjun Kharge : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేయడంపై విపక్ష నేతల విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే…. ప్రధాని నరేంద్ర మోడీ చర్యలపై మండిపడ్డారు. ప్రధాని మోదీ జపాన్‌కు వెళ్లినప్పుడల్లా ‘నోట్ బందీ’ నోటిఫికేషన్ వస్తుందని ఖర్గే ఎద్దేవా చేశారు. గతంలో 2016లో రాత్రికి రాత్రే రూ.500, రూ.1,000 నోట్లను డీమోనిటైజేషన్ చేశారన్నారు. అప్పుడూ జపాన్‌కు వెళ్లినప్పుడే రూ.1,000 నోటు రద్దు జరిగిందనీ, ఈసారి మళ్లీ జపాన్ కు వెళ్లినప్పుడు రూ.2,000 నోటు రద్దు చేశారంటూ ఖర్గే మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం (మే 19) హిరోషిమా చేరుకున్నారు . ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మూడు దేశాలను దర్శించనున్నారు. జపాన్ అనంతరం పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాకు వెళ్లున్నారు.
Read Also:Tollywood Anchors: మాల్దీవుల్లో వెకేషన్స్.. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది పాపలు
ఖర్గే ఈ సారి నోట్ల రద్దును “సెంకడ్ డీమోనిటైజేషన్”గా అభివర్ణించారు. ఇది తప్పుడు నిర్ణయానికి తెరలేపుతుందా? లేదా?..అనేది నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు వెల్లడవుతాయని ట్వీట్‌లో పేర్కొన్నారు. మొత్తం అసంఘటిత రంగాన్ని సర్వనాశనం చేసిన మొదటి పెద్ద నోట్ల రద్దుతో మీరు ఆర్థిక వ్యవస్థకు తీవ్ర గాయం చేశారు. MSMEలను నిలిపివేశారు. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారని ఖర్గే ట్వీట్ చేశారు. కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య, ఆయన మంత్రివర్గం ప్రమాణస్వీకారం అనంతరం ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. దేశానికి మేలు చేస్తుందో, నష్టమో ఆయనకు (పీఎం) తెలియదని, మోదీ చేసిన ‘నోటు రద్దు’ ఈసారి కూడా చేయడం ,ప్రజలను ఇబ్బంది పెట్టబడమేనని అన్నారు. కర్ణాటకలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ‘ప్రేమ ప్రభుత్వం’గా పేర్కొంటూ.. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఐదు వాగ్దానాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య శనివారం బెంగళూరులో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
Read Also:Pawan Kalyan: ‘బ్రో’.. అసలే ఎండాకాలం.. నువ్వు మరింత హీట్ పెంచేస్తున్నావ్
