Site icon NTV Telugu

Munugodu: మునుగోడు ప్రచారంలో కాంగ్రెస్ కాళ్లు మొక్కుడు కార్యక్రమం

New Project (14)

New Project (14)

Munugodu: మునుగోడు ఉపఎన్నిక ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. గెలిచేందుకు ఉపయోగపడే ఏ చిన్న అంశాన్ని కూడా పక్కనపెట్టే పరిస్థితిలేదు. ఇప్పుడు తెలంగాణలో ఏటుచూసినా ఒకటే చర్చ..! ఎవరు గెలుస్తారు..? సెకండ్ ప్లేస్ లో ఎవరుంటారు..? ఇక్కడ ఓడితే ఆ పార్టీ సంగతి అంతేనట కదా…! గెలిస్తే… ఇంకో పార్టీకి తిరుగులేదంట కదా అనే ముచ్చటే నడుస్తోంది..! ఇక నియోజకవర్గంలో చూస్తే మాత్రం… ప్రతి పల్లె ప్రచారంతో మార్మోగిపోతుంది. ప్రధాన పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మాత్రం… ఏ చిన్న ఛాన్స్ వదులుకోవడానికి సిద్ధంగా లేవు. విక్టరీనే లక్ష్యంగా… పావులు కదుపుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల ఎత్తులకుపై ఎత్తులు అన్నట్లు వ్యూహాలు రచించేస్తున్నాయి. అయితే ఇవన్నీ ఇలా ఉంటే… మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఎన్ఎస్‎యూఐ విచిత్ర ప్రచారానికి పిలుపునిచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ మారింది. అసలు ఈ అల్లుళ్ల రాజకీయమేంటో చూస్తే మాత్రం… ఇంత కథ ఉందా అన్సాలిందే…

Read Also: Audimulapu Suresh: పవన్ మాటతీరు వల్లే దాడులు.. చర్యలు తప్పవు..

మునుగోడు నియోజకవర్గ చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఎన్ఎస్‎యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆ నామినేషన్ ర్యాలీలో ఎన్ఎస్‎యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి సారథ్యంలో సుమారు 1000 మందితో కూడిన తెలంగాణ ఎన్ఎస్‎యూఐ బృందం… ప్రజాస్వామ్య ‘పరిరక్షణకై పాదాభివందనం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. మునుగోడులో ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే శనివారం కూడా మునుగోడు నియోజకవర్గ అన్ని మండల కేంద్రాలకు ఎన్ఎస్‎యూఐ నాయకులు బృందాల వారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ ప్రజల కాళ్లు మొక్కుతూ ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతను మునుగోడు నియోజకవర్గ ప్రజలు తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని వారు పిలుపునిచ్చారు.

Exit mobile version