Site icon NTV Telugu

Maldives: మాల్దీవుల్లో ముయిజ్జు పార్టీ విక్టరీ.. భారత్ స్పందన ఇలా..!

Me

Me

మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై భారత్‌ స్పందించింది. ఇరుదేశాల మధ్య పార్లమెంటు స్థాయిలో అనేక సంప్రదింపులు కొనసాగుతున్నాయని.. కొత్త పార్లమెంటుతోనూ ఇవి సజావుగా సాగగలవని ఆశిస్తున్నట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి: May Bank Holidays: ‘మే’ లో ఏకంగా 12 బ్యాంకు సెలవులు.. ఏ రోజుల్లో సెలవంటే..

ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు విజయవంతమైనందుకు మాల్దీవులకు భారత్ అభినందనలు తెలిపింది. ఇరుదేశాల మధ్య సుదీర్ఘ, చారిత్రక సంబంధం ఉందని గుర్తుచేసింది. ఆ దేశంతో కలిసి అనేక అభివృద్ధి సహకార కార్యక్రమాలు చేపడుతున్నామని… పార్లమెంటు స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయని గుర్తుచేసింది. కొత్త పీపుల్స్‌ మజ్లిస్‌తోనూ అవి కొనసాగుతాయని భావిస్తున్నామని మీడియా సమావేశంలో జైశ్వాల్‌ పేర్కొన్నారు. తాజా ఎన్నికల్లో గెలుపుతో ముయిజ్జు అనుసరిస్తున్న చైనా అనుకూల విధానానికి స్థానికంగా బలమైన మద్దతు లభించినట్లయింది. భారీ మెజార్టీ కారణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే అధికారం కూడా ఆయనకు లభించింది.

ఇది కూడా చదవండి: Virat Kohli: ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి ఆటగాడిగా విరాట్‌ కోహ్లి అరుదైన రికార్డు..

ఇటీవల మాల్దీవులకు భారత్ మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. లక్ష్యదీప్‌లో ప్రధాని మోడీ పర్యటించి.. పర్యాటకులు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. అంతేకాకుండా ఇండియా నుంచి పర్యాటకుల సంఖ్య కూడా పడిపోయింది. తాజాగా మాల్దీవులు.. భారత్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

Exit mobile version