Central Congo Floods: సెంట్రల్ కాంగోలో భారీ వరదలు.. 22 మంది మృతి! పలువురు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Congo Floods Kills 22 People: సెంట్రల్ కాంగోలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల దాటికి కసాయి సెంట్రల్ ప్రావిన్స్‌లో 22 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. కసాయి సెంట్రల్ ప్రావిన్స్‌లోని కనంగా జిల్లాలో గంటల తరబడి కురిసిన వర్షాలకు అనేక ఇళ్లు, నిర్మాణాలు ధ్వంసమయ్యాయని.. ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసినట్లు ప్రావిన్స్ గవర్నర్ జాన్ కబేయా తెలిపారు.
గోడ కూలిపోవడం వల్ల బికుకులో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది చనిపోయారు. భారీ వర్షాలకు అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి ఇళ్లు, చర్చ్‌లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. వరదల్లో పలువురు గల్లంతయ్యారు. 20 మందికి పైగా ఆచుకీ తెలియడం లేదట. ముఖ్యంగా కనంగా ప్రాంతంలో వరదల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. జాతీయ ప్రభుత్వం నుంచి తక్షణ చర్యను కోరామని ప్రావిన్స్ గవర్నర్ జాన్ కబేయా తెలిపారు. భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించినట్లు చెప్పారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Singareni Elections 2023: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ఆరంభం!
భారీ వర్షాల కారణంగా కాంగోలోని కొన్ని ప్రాంతాలలో వరదలు తరచుగా సంభవిస్తాయి. గత మేలో తూర్పు కాంగోలోని సౌత్ కివు ప్రావిన్స్‌లో కుండపోత వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 400 మందికి పైగా మరణించారు. ఇక డిసెంబర్ తొలి వారంలో కాంగోలోని బుకావు ప్రాంతంలో భారీ వర్షాల వల్ల 14 మంది మృతి చెందారు. తాజాగా 20 మందికి పైగా మరణించారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!