NTV Telugu Site icon

CM Kejriwal: ఈడీ సమన్లపై గందరగోళం.. ఎమ్మెల్యేలతో సీఎం కేజ్రీవాల్ సమావేశం

Kezrival 1

Kezrival 1

CM Kejriwal: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లపై గందరగోళం మధ్య ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈడీ సమన్లకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్‌ను ఈడీ ప్రశ్నించేందుకు సమన్లు పంపింది. నవంబర్ 2న ఈడీ ముందు హాజరుకావాలని తెలిపింది. అయితే సీఎం కేజ్రీవాల్ మాత్రం హాజరుకాలేదు. అంతేకాకుండా.. ఈడీకి ఓ లేఖ రాశారు. ఈడీ సమన్లను ఉపసంహరించుకోవాలని తెలిపారు. ఇది రాజకీయ ప్రేరేపితమని అన్నారు. అదే రోజు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రోడ్ షోలో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లారు.

ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈడీ తనను అరెస్టు చేసేందుకు కుట్రలు పన్నుతోందని తెలిపారు. తనలా ఆలోచించే వారిని కూడా ఈడీ అరెస్ట్ చేస్తుందా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. నిన్న హర్యానాలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “మీరు నన్ను అరెస్టు చేయండి, మోడీ నన్ను కాల్చివేస్తారు, కేజ్రీవాల్ చనిపోతారు, కానీ నిద్రలో మీరు నా గొంతు వింటారు.. నా వాయిస్ మీ చెవులలో ప్రతిధ్వనిస్తుంది. మీరు ప్రశాంతంగా నిద్రపోరని చెప్పారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.