NTV Telugu Site icon

Chandrababu: ఆ నియామకాలు వాయిదా వేయాలి.. యూపీఎస్సీ ఛైర్మనుకు చంద్రబాబు లేఖ

Cbn

Cbn

రాష్ట్ర కేడర్ అధికారులను ఐఏఎస్ లుగా ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపడం నిబంధనలకు విరుద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం యూపీఎస్సీ ఛైర్మనుకు చంద్రబాబు లేఖ రాశారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉన్నందు వల్ల ఐఏఎస్‌ల కన్ఫర్మేషన్‌ ప్రక్రియ చేపట్టడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మొండితనంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే అవుతుందని లేఖలో పేర్కొన్నారు. ఈ పదోన్నతుల జాబితాలో ఉన్నవారు కూడా కేవలం సీఎంఓలో ఉన్నవారే మాత్రమే అని గుర్తు చేశారు. జాబితా కూడా నిబంధనల ప్రకారం రూపొందించలేదని లేఖలో ప్రస్తావించారు. సరైన విధానాలు అనుసరించకుండా పదోన్నతులు కట్టబెట్టేందుకు జాబితాను రూపొందించారని ఆరోపించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్న నేపధ్యంలో ప్రభుత్వం హడావుడిగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టిందని పేర్కొన్నారు.

READ MORE: Balakrishna: ఎన్టి రామారావు వారసులు అంటే ఆయన గురించి చెప్పుకోవడం కాదు.. బాలయ్య హాట్ కామెంట్స్..

పారదర్శకత లేకుండా రూపొందించిన జాబితాను పున:పరిశీలించాలని.. పదోన్నతుల అంశాన్ని జూన్ 7 తర్వాత చేపట్టేలా చూడాలని కోరారు. చంద్రబాబు లేఖ కాపీలను పర్సనల్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీ, కేంద్ర ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెల్లడి కానున్నాయి. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాల ఫలితాలు రానున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగా… టీడీపీ కేవలం 23 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈసారి తెలుగుదేశం పార్టీ కూటమిగా పోటీ చేయగా… వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. విజయంపై రెండు పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి