Site icon NTV Telugu

Donald Trump: ట్రంప్ ప్రకటనతో భారతీయ విద్యార్థుల్లో వణుకు.. వారి బాధలు వారి మాటల్లోనే…

Indian Students Died Abroad

Indian Students Died Abroad

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వారంలోనే ఆయన చేసిన ప్రకటనతో అమెరికాలో నివసిస్తున్న వలసదారులలో భయాందోళనలు నెలకొన్నాయి. అమెరికాలోని చాలా మంది భారతీయ విద్యార్థులు కళాశాల సమయం ముగిసిన తర్వాత పార్ట్ టైమ్ పని చేస్తూ డబ్బు సంపాదించేవారు. ఇప్పుడు వారు తమ పనిని వదిలివేశారు. ఓ జాతీయ మీడియాతో అక్కడున్న కొందరు విద్యార్థులు మాట్లాడారు. ఈ విద్యార్థులలో కొందరు, యూఎస్‌లో మనుగడ సాగించడానికి పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చాలా ముఖ్యమన్నారు. కానీ.. తమ భవిష్యత్తును పణంగా పెట్టలేమని.. తాము అమెరికన్ కళాశాలలో సీటు పొందడానికి భారీగా అప్పులు చేసి వచ్చామని వాపోయారు.

READ MORE: Delhi: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టేలా ఆదేశాలంటూ పిటిషన్.. హైకోర్టు షాక్

యూఎస్ నిబంధనలు F-1 వీసాలపై అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్‌లో వారానికి 20 గంటల వరకు పని చేయడానికి అనుమతిస్తాయి. అద్దె, కిరాణా, ఇతర జీవన వ్యయాలను కవర్ చేయడానికి రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్‌లు లేదా రిటైల్ దుకాణాలలో పని చేయడానికి వీలుండదట. ఇప్పుడు, కొత్త అడ్మినిస్ట్రేషన్ ఇమ్మిగ్రేషన్ విధానాలపై స్క్రూలను బిగించడం, కఠినమైన నిబంధనలను అమలు చేయడంతో విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలను వదులుకుంటున్నారు. వారు తమ భవిష్యత్తును పణంగా పెట్టడానికి సిద్ధంగా లేరు.

READ MORE: US Immigration Raid: ట్రంప్ ఆదేశం.. 538 మంది అక్రమ చొరబాటుదారుల అరెస్ట్

ఇల్లినాయిస్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి అర్జున్ మాట్లాడుతూ.. “నేను నా నెలవారీ ఖర్చులను తీర్చడానికి కళాశాల తర్వాత ఒక చిన్న కేఫ్‌లో పని చేసేవాడిని. నేను గంటకు $7 సంపాదించాను. రోజుకు ఆరు గంటలు పనిచేశాను. ఈ సంపాదన నాకు చాలా ఉపయోగపడింది. కానీ.. ఇమ్మిగ్రేషన్ అధికారులు మేము చేస్తున్న ఈ పనికి పర్మీషన్ లేదని చెబుతున్నారు. పనిపై కఠినంగా వ్యవహరిస్తారని విన్న తర్వాత నేను గత వారం నా ఉద్యోగాన్ని విడిచిపెట్టాను. ముఖ్యంగా నేను ఇక్కడ చదువుకోవడానికి $50,000 (దాదాపు రూ. 42.5 లక్షలు) రుణం తీసుకున్నారు. ఇప్పుడు నేను ఎలాంటి రిస్క్ తీసుకోలేను.” అని తెలిపాడు. హైదరాబాద్‌కు చెందిన నేహా కూడా ఓ రెస్టారెంట్‌లో గంటకు 8 డాలర్ల చొప్పున పనిచేస్తోంది. కొన్ని నెలల తర్వాత పరిస్థితిని మళ్లీ అంచనా వేస్తామని, ఆపై పనిని కొనసాగించాలా వద్దా అని నిర్ణయిస్తామని చెప్పింది.

Exit mobile version