NTV Telugu Site icon

Hyderabad: ఓయూలో కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన

Ou

Ou

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తమకు వెంటనే న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. సెలక్షన్ పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా.. తమకు ఇంతవరకు ట్రైనింగ్ పంపించకపోవడంపై విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. 2022 ఏప్రిల్ లో నోటిఫికేషన్ ఇచ్చి.. అనంతరం సెలక్షన్స్ పూర్తయినా, మూడు నెలలు గడుస్తున్నా కోర్టు కేసుల పేరుతో తమకు అన్యాయం చేయడంపై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరినీ వెంటనే ట్రైనింగ్ పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Show comments