స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో.. తెలంగాణలో టెన్షన్‌కు క్రియేట్ చేసింది. మునవార్ షోను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, మునావర్ షో విషయంలో అలర్ట్ అయిన పోలీసులు.. షోను గంట ముందే ప్రారంభించేలా ప్లాన్ చేశారు. దీంతో, శిల్పకళా వేదికలో మునావర్ షో సాయంత్రం 5 గంటలకే ప్రారంభమైంది. అయితే.. మొత్తానికి మునావర్ కామెడీ షో ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది. ఉద్రిక్తత వాతావరణంలో మునావర్ కామెడీ షో జరిగింది. మునావర్ కామెడీ షో అడ్డుకోవడానికి వచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 50 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేశారు పోలీసులు.
అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. శిల్ప కళావేదిక వద్ద ఇంకా కొనసాగుతున్న పోలీస్ పహారా. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా మునావర్ ఫారూఖీ షో హైదరాబాద్‌లో నిర్వహిస్తే అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. అంతేకాకుండా.. బీజేవైఎం నాయకులు సైతం మునావర్ ఫారుఖీ షో ను అడ్డుకుంటామన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మునావర్ ఫారుఖీ షోకు భారీ బందోబస్తు కల్పించారు.
