NTV Telugu Site icon

Mudasarlova Park Issue: డిప్యూటీ సీఎం పవన్‌ దగ్గరకు ముడసర్లోవ పార్క్ పంచాయితీ..

Mudasarlova Park

Mudasarlova Park

Mudasarlova Park Issue: విశాఖ నగరంలో ప్రముఖ ముడసర్లోవ పార్క్ పంచాయితీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దగ్గరకు చేరింది. పర్యావరణ ఆంక్షలను ఉల్లంఘించి GVMC ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం గత ప్రభుత్వం సన్నాహాలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మూడసర్లోవ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పవన్ కు లేఖ రాశారు మాజీ IAS అధికారి EAS శర్మ.. మరోవైపు, పార్క్ వివాదంపై GVMC మేయర్ స్పందించారు… ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఎటువంటి అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయడం లేదని స్పష్టం చేశారు.

Read Also: IAS Krishna Teja: ఏపీకి ఐఏఎస్‌ కృష్ణ తేజ.. డీఓపీటీ ఉత్తర్వులు

కాగా, చుట్టూ కొండలు, ఎటు చూసి నా జీవ వైవిద్యం, ఆహ్లాదపరిచే రోజ్ గార్డెన్ ఇదీ.. ముడసర్లోవ పార్క్ ప్రత్యేకత. నగరం అంతటా కాలుష్యంతో సతమతం అవుతుంటే ఇక్కడ మాత్రం ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. అందుకే దీనిని విశాఖ ఓజోన్ వ్యాలీగా పిలుస్తుంటారు. ఈ పార్క్ అందాలు నగర వాసులు నే కాదు సినీ దర్శకులకు చాలా ఇష్టం. ఒక దశలో విశాఖలో షూటింగ్ అంటే ముడసర్లోవ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించా లిసిందే. ఇక్కడకు అత్యంత సమీపంలోనే కంబాల కొండ అభయారణ్యం, సింహాచలం అటవీ ప్రాంతం వున్న కారణంగా 105 రకాల పక్షి జాతులకు ఈ పార్క్ ఏరియా ఆవాసంగా మారింది. జీవ వైవిధ్యం, నీటి వనరులు సమూహంగా వున్న రిజర్వాయర్ చుట్టూ వివాదం ముసురుకుంది. కారణం, అభివృద్ధి ప్రణాళికల పేరుతో గత ప్రభుత్వం అనేక నిర్మాణాలను ఇక్కడ ప్రతిపాదించడమే. వీటిలో ఎక్కువ అభ్యంతరాలను ఎదుర్కొన్నది గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ ప్రధాన కార్యాలయం భవనం. ఈ భవనం నిర్మాణాల పేరుతో వైసీపీ హయంలో జరిగిన ప్రయత్నాలు, వాటి వల్ల ఎదురయ్యే పర్యావరణ నష్టం దృష్టిలో పెట్టుకొని రద్దు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కు లేఖ రాశారు మాజీ IAS అధికారి EAS శర్మ.

Read Also: Sexual Harassment: పదో తరగతి చదువుతున్న బాలికపై మేనమామ అత్యాచారం..

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న మూడసర్లోవ పార్క్ 1901 లో నిర్మించబడింది. రిజర్వాయర్ విస్తీర్ణం 70 ఎకరాలు.. కాగా, 20 ఎకరాలలో పార్క్ విస్తరించి వుంది. సమీపంలోని కొండల మీద నుంచి ఏడు వాగుల ద్వారా వచ్చే వర్షం నీటిని సేకరించి ఇక్కడ స్టోర్ చేస్తారు. విశాఖ నగర తాగునీటి అవసరాలను తీర్చడంలో ముడసర్లోవ జలాశయం కీలకమైనది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన రిజర్వాయర్ దగ్గర పర్యావరణ దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నారనే ఫిర్యాదులపై స్పందించారు మేయర్ హరి వెంకట కుమారి. గత ప్రభుత్వం హయాంలో GVMC కేంద్ర కార్యాలయం కట్టడానికి సన్నాహాలు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి పనులు ప్రారంభించలేదనిస్పష్టం చేశారు.

Read Also: Deputy CM Pawan Kalyan: వరల్డ్‌ బ్యాంక్ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్‌ భేటీ..

వాస్తవానికి నగరం నడిబొడ్డున రెండు దశాబ్దాల క్రితం మోడ్రన్ డిజైన్స్ తో అత్యాధునిక వసతులతో GVMC ప్రధాన కార్యాలయం నిర్మాణం జరిగింది. భీమిలి, అనకాపల్లి విలీనం తర్వాత 72 నుంచి 98 డివిజన్లకు విస్తరించగా అందుకు తగ్గట్టుగానే కౌన్సిల్ హాల్ తీర్చిదిద్దారు. ఇక స్థానిక వ్యవహారాలు చూడటానికి జోనల్ కార్యాలయాలు వున్నాయి. కానీ, శివారు ప్రాంతాలు, విలీన మున్సిపాలిటీ ప్రజల సౌకర్యం కోసం GVMC కేంద్ర కార్యాలయం ముడసర్లోవకు తరలిం చేవిధంగా కార్యాలయం నిర్మించేందుకు డిజైన్లు సిద్ధం చేసింది గత ప్రభుత్వం. ఇందు కోసం పార్క్ భూములతో పాటు విలువైన వృక్ష సంపదను తరలించాలిసి వస్తుండగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు మొత్తం ప్రతిపాదనలు రద్దు చెయ్యాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌కు లేఖ ద్వారా ఫిర్యాదులు వెళ్లాయి.. దీంతో.. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

Show comments