రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘రాజాసాబ్’. ఈ సినిమా పై అటు ఫ్యాన్స్ లను ఇటు ట్రేడ్ వర్గాలనలోను భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ కెరీస్ లో తొలిసారి హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో రాజాసాబ్ ను నిర్మిస్తున్నారు. ఈ నెల 16న రాజాసాబ్ టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. రిలీజ్ అయినా 24 గంటల్లో 59 మిలియన్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
అయితే టీజర్ ను నిర్మాతలు అఫీషియల్ గా రిలీజ్ చేయడానికి మూడు రోజుల ముందుగానే సోషల్ మీడియాలో లీక్ చేసారు. ఈ వ్యహారంపై నిర్మాతలు సీరియస్ గా ద్రుష్టి సారించారు. కోట్లు ఖర్చు నిర్మిస్తున్న సినిమా ఫుటేజ్ ఎవరి ద్వారా బయటకి వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజాసాబ్ టీజర్ లీక్ చేసిన వారిపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది సినిమా యూనిట్. లీక్ చేసిన వారిని కనిపెట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసాడు సినిమా డబ్బింగ్ ఇంఛార్జ్ వసంత్‌కుమార్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లీక్ దారులు కనిపెట్టి పనిలో ఉన్నారు.
