Site icon NTV Telugu

సిరిసిల్లాలో ఈతకు వెళ్లి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం

రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల జిల్లాలోని మానేరు వాగు లో గల్లంతయ్యి మరణించిన చిన్నారుల కుటుంబాలను ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయాన్ని అందించి భవిష్యత్తులో అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒక్కొక్క బాధితు కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందించారు మంత్రి కేటీఆర్. వర్కర్స్ టూ ఓనర్ పథకం కింద శ్రీరాము, క్రాంతి కుమార్ కుటుంబానికి రెండు పవర్ లూం జోడీలు సాంక్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు కేటీఆర్‌. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని,అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్‌.

Exit mobile version