NTV Telugu Site icon

Compensation for Crop Loss : తెలంగాణలో వరదలకు జరిగిన పంట నష్టానికి పరిహారం నిధులు విడుదల

Ts Gov Logo

Ts Gov Logo

తెలంగాణలో వరదలకు జరిగిన పంట నష్టానికి పరిహారం నిధులు విడుదల చేసింది తెలంగాణ సర్కార్‌. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6 వరకు కురిసిన భారీ వర్షాల వలన జరిగిన పంట నష్టానికి పరిహారం నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. 79,216 మంది రైతులకు చెందిన 79,574 ఎకరాల పంట నష్టానికి 79.57 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. రైతుల అకౌంట్లకే నేరుగా జమా చేసేటట్టు ఏర్పాట్లు ప్రభుత్వం చేయనుంది. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6 వరకు కురిసిన భారీ నుండి అతిభారీ వర్షాల వలన రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాలలో 79,574 ఎకరాలలో పంటనష్టం సంబవించినట్లు అధికారులు నిర్ధారించగా, దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఆదేశాలతో కేవలం నెల రోజుల వ్యవధిలోనే పంటనష్టపోయిన రైతులకు పరిహారం కింద రూ. 79.57 కోట్ల నిధులు విడుదలయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు.

 Congress: ‘‘ఈవీఎంలు హ్యాక్ చేశారు’’..హర్యానా ఓటమిపై కాంగ్రెస్ సంచలనం..

అత్యధికంగా పంటనష్టం ఖమ్మం జిల్లాలో (28,407 ఎకరాలు), తరువాత మహబూబాబాద్ (14,669), సూర్యాపేట (9,828 ఎకరాలు) సంబవించినట్లు మిగతా 22 జిల్లాలకు సంబంధించి అత్యల్పంగా 19 ఎకరాల నుండి 3,288 ఎకరాల వరకు పంటనష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు నిర్ధారించారు. పంటనష్ట పరిహారం ఎకరానికి 10 వేల చొప్పున నేరుగా రైతు ఖాతాలలోనే జమ అయ్యేటట్లు అధికారులు ఏర్పాటు చేసినట్టు మంత్రివర్యులు తెలియజేశారు.

 Vettaiyan: ‘వేట్టయన్ ది హంటర్’ టైటిల్‌పై దిల్ రాజు క్లారిటీ.. అందుకే తమిళ్ లో పెట్టాం!