Site icon NTV Telugu

Bribe: రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అసిస్టెంట్ కమిషనర్..

Bribe

Bribe

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. హైదరాబాద్‌లోని నాంపల్లి, గగన్ విహార్ 11వ అంతస్తులో ఏసీబీ అధికారులు రైడ్స్ చేపట్టారు. ఈ క్రమంలో.. మలక్‌పేట్-II సర్కిల్‌కు చెందిన కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ మహబూబ్ బాషా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రూ. లక్ష డిమాండ్ చేసి 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఫిర్యాదుదారుడి బ్యాంక్ ఖాతా డీఫ్రీజ్ కోసం లెటర్ ఇచ్చేందుకు కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు.

Read Also: Ragging: నల్గొండ మెడికల్ కాలేజీ హాస్టల్లో ర్యాగింగ్ పై నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం..

A-1 మహబూబ్ బాషాతో పాటు A-2 సోమ శేఖర్ అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్.. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ సేవకుడు లంచం డిమాండ్ చేసినట్లయితే.. చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి A.C.B యొక్క టోల్ ఫ్రీ నంబర్, 1064ను సంప్రదించాలని ఏసీబీ అధికారులు ప్రజలను కోరారు. బాధితురాలి/ఫిర్యాదుదారు పేరు, వివరాలు రహస్యంగా ఉంచబడుతాయని తెలిపారు.

Read Also: Womens Asian Champions Trophy 2024: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేతగా భారత్..

Exit mobile version