Playboy Services: తన పేరు, ఫోన్ నంబర్‌ను ప్రస్తావిస్తూ.. తనతో శృంగారం చేయాలనే కోరిక ఉంటే ఈ నంబర్‌కు ఫోన్ చేయాలంటూ పలువురికి చిట్టీలు విసిరిన ఓ కళాశాల విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగింది. నవ రాయ్‌పూర్‌లోని సెక్టార్ 30లోని అవినాష్ న్యూ కాలనీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్దిరోజులుగా కొంతమంది నివాసితులకు వింత చీటీలు వచ్చాయి. ఆ స్లిప్‌లలో విద్యార్థి తనను తాను ‘ప్లేబాయ్’ అని భావించి.. తన కాంటాక్ట్ నంబర్‌ను పేర్కొని శృంగారం ఆఫర్ చేశాడు.
Harassment Allegations: క్రీడా మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. విచారణ చేపట్టిన పోలీసులు
ఈ అసభ్యకరమైన చిట్టీలతో ఇబ్బంది పడిన నివాసితులు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో స్థానికులు రాఖీ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి నవ రాయ్‌పూర్‌లోని ఓ కళాశాలలో చదువుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, ఈ అసభ్యకర చర్యకు ఎందుకు పాల్పడ్డాడో తెలుసుకునేందుకు ప్రస్తుతం ఆ వ్యక్తిని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. ఎవరైనా యువకుడి పేరు చెడగొట్టేలా దుర్మార్గంగా ప్రవర్తించారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. చిట్టీలపై రాసివున్న ఫోన్ నంబర్ అమ్మాయిది అని, ఆమెను వేధించేందుకు ఉద్దేశ్యపూర్వకంగా చిట్టీలు విసిరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారని తెలుస్తోంది.