NTV Telugu Site icon

Prakasam: ఒంగోలు భూ కబ్జాల కేసులో 38 మందిని అరెస్ట్

Ongole

Ongole

ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా కొనసాగుతున్న భూ కబ్జాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసేందుకు సిట్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ వెల్లడించారు. వీలైనంత తొందరలో విచారణ దర్యాప్తు పూర్తి చేస్తాని తెలిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన భూకబ్జాలపై ఎస్పీ మలికా గార్గ్‌తో కలిసి చర్చించారు. భూకబ్జాలపై ఫిర్యాదులు వచ్చాయని, ఈ మేరకు లాయర్‌పేటలోని ఓ ఇంట్లో తనిఖీలు చేయగా.. పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కొన్ని పత్రాలు సృష్టిస్తున్నట్లు పోలీసులు గుర్తించారని కలెక్టర్ చెప్పుకొచ్చారు.

Read Also: Health Tips : రాత్రి పడుకొనే ముందు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

అన్ని పత్రాలకు నకిలీ స్టాంపులు సృష్టించి ఫోర్జరీ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. 572 ఫేక్ డాక్యుమెంట్స్, 60 స్టాంప్స్, 1200 జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్ పత్రాలను పోలీసులు సీజ్ చేశారు.. నకిలీ డాక్యుమెంట్స్ కేసులో 38 మందిని అరెస్టు చేశారు.. కనిగిరి, మార్కాపురంలో కూడా భూకబ్జాలపై సిట్ దర్యాప్తు జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. గత 10-12 సంవత్సరాల నుంచి భూకబ్జాలు జరుగుతున్నట్టు విచారణలో తేలింది.. ఖాళీ భూములు గుర్తించి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేస్తున్నారు అని కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు.

Read Also: Janareddy: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా ఉంది కాబట్టి ఐటీ దాడులు

బాధితులు ఎవరైనా ఉంటే సిట్ అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. అయితే, భూములకు నకిలీ జీపీఏ, వీలునామాలు తయారు చేసి కబ్జా చేశారని ఆయన చెప్పారు. ఇలాంటి ఆస్తుల్ని ఒంగోలులో 52 గుర్తించాము.. భూకబ్జాల కేసులో ఒక ప్రభుత్వ ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అరెస్టైన వారిలో 2 ప్రధాన పార్టీలకు చెందిన వారు ఉన్నారని ఎస్పీ మలికా గార్గ్‌ వెల్లడించారు.