NTV Telugu Site icon

Collector Dilli Rao : నాటుసారా తయారు చేసే గ్రామాల పై ఫోకస్ పెట్టాం

Dilli Rao

Dilli Rao

స్టేట్ జనరల్ అబ్జర్వర్లు వచ్చి జిల్లాను పరిశీలించారన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. స్టేట్ పోలీసు అబ్జర్వర్ 8న జిల్లాకి వస్తున్నారన్నారు. 8 మంది ఆర్వో లతో కోఆర్డినేషన్ జరుగుతోందన్నారు ఢిల్లీ రావు. సీజింగ్ లు అధికంగానే జరుగుతున్నాయి… 3 కేజీల గోల్డు, 4 కేజీల వెండి కూడా సీజ్ అయిందన్నారు. C-Vigil కంప్లైంట్ లు కూడా వస్తున్నాయన్నారు. లిక్కర్ సంబంధించిన కంప్లైంట్ లు తక్కువ సంఖ్యలోనే వచ్చాయన్నారు. నాలుగు రకాల లిక్కర్ 4300 లీటర్లు సీజ్ చేసి 369 కేసులు బుక్ చేసామని, నాటుసారా తయారు చేసే గ్రామాల పై ఫోకస్ పెట్టామన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచీ కొని బెల్టు షాపులు నిర్వహిస్తే వాటిపైనా కేసులు పెడుతున్నామని, తెలంగాణ లిక్కర్ ను ఇద్దరు మహిళలు తీసుకొచ్చి కొండపల్లిలో అమ్మాలని చూస్తే వారిని కూడా పట్టుకున్నామన్నారు.

18 నుంచీ జరిపే ఖర్చులు అభ్యర్ధి ఖాతాలో పడతాయని ఆయన తెలిపారు. 16.9 లక్షల మంది ఓటర్లు ఉన్నట్టు గుర్తించామన్నారు. కృష్ణా జిల్లాలో 1863, ఎన్టీఆర్‌ జిల్లాలో 1781 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. సుమారుగా 840 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు గుర్తించామన్నారు. 680 చోట్ల సిసి కెమెరాలు పెట్టి పర్యవేక్షిస్చేసాంఈనెల 13, 14 తేదీలలో PO, APO లకు శిక్షణ ఉంటుందన్నారు. ఈనెల 12న ఈవీఎం లు ఎక్కడకి ఏవి అనేది సిద్ధం చేస్తామని, నోవా, నిమ్రా కాలేజీల వద్ద స్ట్రాంగ్ రూం లు సిద్ధం చేసామన్నారు. 12 దాకా ప్రధాన చెక్ పోస్టులు ఉన్నాయి… అవి అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నాయన్నారు.