Site icon NTV Telugu

Cold Wave: చలిగాలుల కారణంగా 100 మందికి పైగా మృతి

Afghanistan

Afghanistan

Cold Wave: తీవ్రమైన శీతల వాతావరణం, కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం కారణంగా గత రెండు వారాల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో 100 మందికి పైగా మరణించారని ఆదివారం తాలిబాన్ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వివిధ ప్రావిన్స్‌లలో కనీసం 104 మంది మరణించారని, 50 ఇళ్లు ధ్వంసమయ్యాయని తాలిబాన్ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ ప్రతినిధి షఫయ్ రహిమి చెప్పారు.
తాలిబాన్ ప్రకారం.. 15 ప్రావిన్సులలో మరణాలు సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఘోర్ ప్రావిన్స్‌కు చెందిన అబ్దుల్ జహీర్ చలి వాతావరణం కారణంగా తన పిల్లలలో ఒకరిని కోల్పోయామని, ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక పరిస్థితులతో పోరాడుతున్నామని చెప్పారు. తనపిల్లలందరూ అనారోగ్యంతో ఉన్నారని.. వారిలో ఒకరు మరణించారని ఆయన చెప్పారు.

దేశంలో చాలా మంది విపరీతమైన చలి కారణంగా బాధించబడుతున్నారని తెలిసింది. ఈ చలిగాలుల కారణంగా చాలా కుటుంబాలకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు, వారు ఇళ్లలో వెచ్చదనం కోసం ప్రత్యామ్నాయం కూడా లేదని ఫర్యాబ్ ప్రావిన్స్ నివాసి మహ్మద్ అజీమ్ వెల్లడించారు. తాలిబాన్ నేతృత్వంలోని సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గణాంకాల ఆధారంగా.. గత రెండు వారాలుగా చలి కారణంగా పదివేల పశువులు చనిపోయాయని తెలిసింది.

Bride Cancels Marriage: వరుడికి అది రాదని పెళ్లికి నిరాకరించిన యువతి

ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌లో కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం కారణంగా కనీసం 140 మంది ఆసుపత్రి పాలైనట్లు టోలో న్యూస్ ఇటీవల నివేదించింది. ఆసుపత్రి పాలైన వారిలో చాలా మంది చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు.
దేశంలో కట్టెలు, ఇతర ప్రాథమిక సౌకర్యాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నందున కఠినమైన శీతాకాలాల మధ్య తమ ఇళ్లను వేడి చేయడానికి గ్యాస్‌ను ఏకైక ఎంపికగా ఉపయోగిస్తున్నామని హెరాత్ నివాసితులు తెలిపారు.అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పడిపోవడం ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇప్పటికే పేదరికం, ఆహారం, ఇంధనం కొరత కారణంగా ఇబ్బందుల్లో ఉన్న దేశంలో పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Exit mobile version