Kadapa: కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది.. మున్సిపల్ కమిషనర్ వర్సెస్ మేయర్‌గా మారింది పరిస్థితి.. కడప మున్సిపల్ కార్పొరేషన్ లో కమిషనర్‌తో పాటు ఎనిమిది మంది అధికారులకు మేయర్ సురేష్ బాబు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, ఎస్ఈ, ఎంహెచ్‌వో, మేనేజర్, కౌన్సిల్ సెక్రటరీ, ఇద్దరు ఆర్వోలకు నోటీసులు జారీ చేశారు.. ఈ నెల 13వ తేదీన మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి సంబంధించిన అజెండా కాపీలు అందించినా.. ఎందుకు సర్వ సభ్య సమావేశానికి హాజరు కాలేదని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు.. శుక్రవారం జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి అధికారులు ఎవరూ హాజరు కాకపోవడంపై మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.. సమావేశానికి ఎందుకు గైర్హాజరయ్యారు అయ్యారో సమాధానం చెప్పాలని ఆయన షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు…
Read Also: Israel Iran war: ఇరాన్‌కు భారీ షాక్.. ఖుద్స్ ఫోర్స్ కమాండర్ హతం
