Israel Iran war: ఇరాన్‌కు భారీ షాక్.. ఖుద్స్ ఫోర్స్ కమాండర్ హతం
- ఇరాన్‌కు భారీ షాక్ ఇచ్చిన ఇజ్రాయెల్..
- ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ షాహ్‌రియారీ హతం..
- డ్రోన్ యూనిట్ కమాండర్ సయీద్ ఇజాదితో పాటు పలువురు చనిపోయారు: ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Iran war: ఇరాన్‌లోని కీలక ప్రదేశాలు, ముఖ్య నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగుతుంది. తాజాగా, టెహ్రాన్‌కు మరో షాక్ తగిలింది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్‌రియారీ చనిపోయినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఇరాన్ నుంచి హమాస్, హెజ్‌బొల్లా, హూతీ తదితర సంస్థలకు ఆయుధాల సరఫరాలో షాహ్‌రియారీ కీలక పాత్ర పోషించినట్లు పేర్కొనింది. ఇక, శుక్రవారం నాడు టెల్ అవీవ్ ఫైటర్ జెట్‌లు చేసిన దాడుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వైమానిక దళం.. డ్రోన్ యూనిట్ కమాండర్ సయీద్ ఇజాది సహా పలువురు నేతలు చనిపోయినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇవాళ (జూన్ 21న) ధ్రువీకరించాయి.
Read Also: Kannappa : కన్నప్ప మేకింగ్ వీడియో.. ప్రభాస్ ఎలా చేస్తున్నాడో చూడండి..
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- 22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
కాగా, 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై టెహ్రాన్ చేసిన దాడులకు ప్రణాళికలు రచించింది అతడే అని పేర్కొన్నాయి. ఇరాన్, హమాస్‌ల మధ్య కీలక సమన్వయ కర్తగానూ ఇజాది వ్యవహరించాడని తెలిపాయి. అయితే, ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఇప్పటి వరకు ఇరాన్‌కు చెందిన అత్యున్నత సైనిక అధికారులతో పాటు అణుబాంబు తయారీలో పని చేస్తున్న పలువురు శాస్త్రవేత్తలు సైతం ప్రాణాలు కోల్పోయారు.
సాయుధ దళాల్లో మృతి చెందిన వారు వీరే..
* ఘోలామ్రేజా మెహ్రాబీ – సాయుధ దళాల జనరల్ స్టాఫ్ నిఘా డిప్యూటీ జనరల్
* మెహదీ రబ్బానీ – ఆపరేషన్ డిప్యూటీ జనరల్
* హొస్సేన్ సలామీ – ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ చీఫ్
* మహమ్మద్ బాఘేరి – సైనిక దళాల పర్యవేక్షకుడు
* అమీర్‌అలీ హాజీజదే – దేశ క్షిపణి కార్యక్రమ అధిపతి
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!