NTV Telugu Site icon

Cockroach : అణు యుద్ధాన్ని కూడా గెలిచేస్తుంది కానీ ఆడదాని దెబ్బకు చచ్చిపోతుంది

New Project 2024 10 13t101720.928

New Project 2024 10 13t101720.928

Cockroach : దర్శకధీరుడు రాజమౌళి ఈగ మీద సినిమా వచ్చిన తర్వాత జంతువులు, పక్షులు, కీటకాల పేర్ల మీద చాలా సినిమాలు వచ్చాయి. అవే ముఖ్య పాత్రలుగా సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు బొద్దింక పేరు మీద కూడా సినిమా రాబోతుంది. శ్రీ లక్ష్మి పిక్చర్స్, ఆదిత్య సినిమాస్ బ్యానర్ల మీద బి బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మాణంలో పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో కాక్రోచ్ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతుంది.

Read Also:CPI Narayana: క్షమించండి… మీ “అలయ్‌ బలయ్‌” కార్యక్రమానికి నేను రాను..

దసరా సందర్భంగా నిన్న ఈ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్ లో ఓ బొద్దింకపై కాక్రోచ్ అనే టైటిల్ పెట్టగా.. అణుయుద్ధాన్ని అయినా గెలుస్తుంది కానీ ఆడదాని దెబ్బకు చస్తుంది అనే ఆసక్తికర క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ పోస్టర్ సినిమా మీద క్యూరియాసిటీని పెంచింది. ఇక ఈ కాక్రోచ్ సినిమా విశాఖపట్నం నేపథ్యంలో సాగే ఓ వైలెంట్ యాక్షన్ ప్రేమ కథ అని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ తెలిపారు. ఈ సినిమాకు ప్రదీప్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు.

Read Also:Pakistan : పాకిస్తాన్‌లో దారుణం…ప్రయాణీకుల వాహనంపై కాల్పులు, 11 మంది మృతి

Show comments