Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jantar Mantar Protest: ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసనలకు అనుమతి లేకున్నా.. నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఐదు రోజుల పాటు తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు, వీరితో పాటు అరెస్టయిన అజింక్య షిండేను శాంతిభద్రతల బాండ్ మీద పోలీసులు విడిచిపెట్టారు. బుధవారం ఈ ముగ్గురిని పోలీసులు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎస్ఈఎం) కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ విచారణలో సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు జ్యుడీషియల్ కస్టడీ విధించగా, అజింక్య షిండే బాండ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని బయటకు వచ్చారు. ఇక, ఎలక్టోరల్ రోల్స్‌కు సంబంధించిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) లో అవకతవకలు జరిగాయని, అలాగే జంతర్‌మంతర్‌ను నిరసన ప్రదేశం కాకుండా మార్చేశారని ఆరోపిస్తూ సీజేపీ ఆందోళనలు చేపడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశం కానుంది.
ఢిల్లీ పోలీసులు ఈ ముగ్గురిపై సెక్షన్ల వారీగా కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా ప్రవేశించడం (ట్రెస్పాస్), నిషేధిత ఉత్తర్వులను ఉల్లంఘించడం, శాంతి భద్రతల బాండ్‌ను బ్రేక్ చేయడం, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలను మోపారు. ఈ ఘటనపై సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వాలు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. “అశు, సౌరవ్‌లను ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. వాళ్లు చేసిన తప్పు ఏంటి? జంతర్‌మంతర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడమేనా?” అని ఆయన ఎక్స్ (X) వేదికగా ప్రశ్నించారు. “ధైర్యం ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా ఎమర్జెన్సీ ప్రకటించండి అంతేగానీ, ఇలాంటి పిరికిపంద చర్యల వెనక దాక్కోకండి” అంటూ ఆయన పోస్ట్ చేశారు. అంతకుముందు, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఉన్న షిండే, రంకా, దాస్‌ల ఫోటోను కూడా ఆయన షేర్ చేస్తూ, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారి మనోధైర్యం దెబ్బతినలేదని పేర్కొన్నారు. వాస్తవానికి.. గొడవకు ముందు శనివారం నాడు ఢిల్లీలో జరిగిన ఒక నిరసన సమయంలోనే రంకా, దాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఏడాది పాటు ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా నడుచుకుంటామని వారు బాండ్ రాసిచ్చారు. అయితే, ఆ తర్వాతే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Also Read
- Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
- Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
తాజావార్తలు
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!