సంక్రాంతి సందర్భంగా ఏపీలో సందడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో భారీగా జనం చేరుకున్నారు. సినిమా తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నేతల ఎంట్రీతో కోడిపందాల జోరు కొనసాగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండవ రోజు సంక్రాంతి కోడిపందాలు ప్రారంభమయ్యాయి. కోనసీమ వ్యాప్తంగా వందల సంఖ్యలో బరులు ఏర్పాటు చేశారు. పలుగ్రామాల్లో రెండు నుంచి మూడు కోడిపందాల బరులు ఏర్పాటు చేసి జోరుగా పందాలు నిర్వహిస్తున్నారు. బరుల వద్దకు జోరుగా పందెం రాయళ్లు తరలివస్తున్నారు.పోలీసుల హెచ్చరికలు నేపధ్యంలో గుండాటలు, గ్యాంబ్లింగ్ గేమ్స్ పై నిషేధం కొనసాగుతుంది. రెండవ రోజు కోడిపందాల హోరుతో సంక్రాంతి పండుగ శోభ రెట్టింపయింది. కోడిపందాలలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.
కాకినాడ రూరల్ లో కోడిపందాల నిర్వాహకులు ఆకర్షణీయమయిన బహుమతులు అందచేస్తున్నారు. వందల బరుల్లో కోడిసందాలు సాగుతున్నాయి. పందేల్లో గెలిచిన కోడిపుంజు యజమానులకు రాయల్ ఎన్ ఫీల్డ్ వంటి ఖరీదైన బైకులు బహుమతులు అందచేస్తున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ మంచి ఊపు మీదున్నారు. రాత్రి వేళల్లో ఫ్లడ్ లైట్లు ఏర్పాటుచేశారు. ప్రజాప్రతినిధులు కోడిపందాలను ఇజ్జత్ కా సవాల్ గా భావిస్తున్నారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాల జోరు కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన బరుల్లో పందెం పుంజులు నువ్వా నేనా అంటూ పోరాడుతున్నాయి. కోడి పందాలు చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దెందులూరు లో కోడి పందాల జోరు హోరెత్తింది. పందెం బరుల బయట పేకాట, గుండాట ఇతర ఆటలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
Read Also: Vande Bharat Train Opening Pm Modi Live: వందేభారత్ రైలొచ్చేసింది… మోడీ లైవ్
చిన్న పెద్ద తేడా లేకుండా ఈ ఆటల్లో పాల్గొంటున్నారు. ప్రతి గుండాట దగ్గర లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. వచ్చిన డబ్బుల్ని బ్యాగుల్లో సర్దుతూ కనిపించారు నిర్వాహకులు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జోరుగా సాగుతున్న సంక్రాంతి కోడిపందాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి పెద్దఎత్తున కోనసీమకు తరలివస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు వందల 50 బరులు ఏర్పాటు చేసి కోట్లలో పందాలు నిర్వహిస్తున్నారు. కోడిపందాలపై హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల నుండి వచ్చిన వారు ఆనందంతో ఎంజాయ్ చేస్తున్నారు. సరదాగా సాగే గుండాటలు, గ్యాంబ్లింగ్ గేమ్స్ పై నిషేధం కొనసాగడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుండి రాకతో కిక్కిరిసిన కోడిపందాల శిబిరాల వద్ద సందడి చేశారు.
Read Also: BRS Flexi in AP: ఏపీలో భారీగా వెలసిన కేసీఆర్, కేటీఆర్ ఫెక్సీలు.. సంక్రాంతి బరిలో బీఆర్‌ఎస్