CM YS Jagan: రేపు పులివెందులలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదట సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టిన వైసీపీలో ఫుల్‌జోష్ కనపడుతోంది. ఈ జోష్‌లోనే నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11:25 నుంచి 11:40 మధ్య ముఖ్యమంత్రి జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం 8:15 కు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నారు. . కడప నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో పులివెందులకు చేరుకోనున్నారు.
Read Also: Memantha Siddham Bus Yatra: నేటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.
పులివెందులలోని సీఎస్ఐ గ్రౌండ్‌లో ఉదయం 10 గంటల నుంచి 11:15 వరకు పబ్లిక్ మీటింగ్‌లో సీఎం పాల్గొననున్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 11.25 నుంచీ 11.40 గంటల లోపల నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం పులివెందుల నుంచి కడపకు చేరుకొని.. కడప నుండి గన్నవరం బయలుదేరి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీఎం జగన్ నామినేషన్ ర్యాలీ కోసం వైసీపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. పులివెందుల బహిరంగ సభ ద్వారా మరో విడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలోనో అంతకుమించి అన్నట్టు ప్రచారాన్ని పరుగులు పెట్టించేలా ప్రణాళిక సిద్ధం చేశారు ముఖ్యమంత్రి జగన్. ప్రతీరోజు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనేలా సీఎం జగన్ ప్రచార షెడ్యూల్ సిద్ధమవుతోంది.