Site icon NTV Telugu

Rythu Bharosa: కౌలు రైతులకు గుడ్‌న్యూస్‌.. రేపే ఖాతాల్లో నగదు జమ

Cm Ys Jagan

Cm Ys Jagan

Rythu Bharosa: కౌలు రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. గురువారం రోజు అనగా రేపు కౌలు రైతులకు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను అందించబోతున్నారు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్‌.. బటన్‌ నొక్కి.. కౌలు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా ఆర్థిక సాయాన్ని అందించనుంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం.. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తూ వస్తుంది సర్కార్..

Read Also: Vijay Setupathi: ‘ఉప్పెన’ విలన్ అసలు కూతురును చూశారా.. ?

ఇక, కౌలు రైతులకు పెద్దఎత్తున కౌలు కార్డులు జారీ చేసే లక్ష్యంతో వైఎస్ జగన్‌ ప్రభుత్వం ప్రత్యేక సీసీఆర్‌సీ మేళాలు నిర్వహిస్తోన్న విషయం విదితమే.. ఆర్బీకే స్థాయిలో మేళాలు నిర్వ­హించేలా వ్యవసాయ, రెవెన్యూ శాఖలు చర్యలు చేపట్టాయి. కౌలు రైతులకు వంద శాతం పంట రుణాలు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల­ను ప్రభుత్వం ఆర్బీకేలతో లింక్‌ చేసింది.. ఇప్పటికే వరుగా వివిధ పథకాలకు సంబంధించిన నగదును బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చూస్తూ వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. రేపు కౌలు రైతులకు శుభవార్త వినిపిస్తూ.. వారి ఖాతాల్లో సొమ్మ జమచేయనున్నారు.

Exit mobile version