NTV Telugu Site icon

CM YS Jagan: తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్ధాయి పర్యటన.. రేపు రెండు జిల్లాలకు సీఎం జగన్‌

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan: మిచౌంగ్‌ తుఫాన్‌ ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసమే సృష్టించింది.. పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు ఉన్నా.. ఈ నెల 9వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలోకి వెళ్లి.. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయనున్నారు.. నష్టపోయిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అందజేస్తామని ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అయితే, క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధం అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. రేపు మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించబోతున్నారు.. అందులో భాగంగా ముందుగా తిరుపతి, బాపట్ల జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇక, ఈ పర్యటన కోసం రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి వెళ్లనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌..

Read Also: Hai Nanna: ఎంత జాగ్రత్తగా ఆ హీరోయిన్ ను దాచారు మావా.. సూపర్ అంతే

శుక్రవారం రోజు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వద్ద స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన కొనసాగనుంది.. గ్రామస్ధులు, తుఫాన్‌ బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు సీఎం వైఎస్ జగన్.. అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారి పాలెంకు చేరుకుంటారు.. అక్కడ తుఫాన్‌ బాధితులతో మాట్లాడిన అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెంకు వెళ్లనున్నారు.. రైతులతో మాట్లాడిన తర్వాత బుద్దాం చేరుకుని తుఫాన్‌ వల్ల దెబ్బ తిన్న వరిపంటలను పరిశీలించనున్నారు.. అనంతరం రైతులతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి జగన్‌.. పంట నష్టంపై ఆరా తీయనున్నారు.. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు సీఎం వైఎస్‌ జగన్‌.