Site icon NTV Telugu

YSR Aasara scheme: వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌.. రేపే ఖాతాల్లో సొమ్ము జమ

Ys Jagan

Ys Jagan

YSR Aasara scheme: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రేపు అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు.. వరుసగా సంక్షేమ పథకాల నిధులను విడుదల చేస్తూ వస్తున్న ఆయన.. రేపు ఉరవకొండ వేదికగా.. వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.. ఉరవకొండలో జరిగే కార్యక్రమంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఇక, ఈ పర్యటన కోసం.. రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. ఉరవకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.. వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత కింద వర్చువల్ గా డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు.. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read Also: Ayodhya : అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన తేదీ వచ్చేసింది.. ప్రకటించిన ముస్లిం పక్షం

సీఎం జగన్‌ పర్యటనకు సంబంధిచిన వివరాల్లోకి వెళ్తే..
* 23న ఉదయం 9 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో బయల్దేరి ఉదయం 9.45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు.
* ఉదయం 10 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 10.30కు ఉరవకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు సీఎం జగన్‌.
* హెలిప్యాడ్‌ వద్ద ఉదయం 10.30 నుంచి 10.40 గంటల వరకు ప్రజాప్రతిధులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు ఏపీ సీఎం.
* 10.40 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి బయల్దేరి 10.50 గంటలకు బహిరంగ సభావేదికకు చేరుకుంటారు..
* 10.55 నుంచి మధ్యాహ్నం 12.35 గంటల వరకు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడతారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
* బహిరంగలో ఉపన్యాసం తర్వాత వైఎస్సార్‌ ఆసరా నాల్గో విడత కింద కంప్యూటర్‌ బటన్‌ నొక్కి డ్వాక్రా సంఘాల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
* మధ్యాహ్నం 12.35 గంటలకు తిరుగు ప్రయాణం అవుతారు.. సభ వేదిక నుంచి బయల్దేరి హెలిప్యాడ్‌ వద్దకు 12.45 గంటలకు చేరుకుంటారు. 1.45 గంటల వరకు స్థానిక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో మాట్లాడనున్నారు.
* మధ్యాహ్నం 1.50 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.20కు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30కు అక్కడి నుంచి విమానంలో గన్నవరం చేరుకోనున్న సీఎం జగన్‌.. రోడ్డు మార్గంలోని తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

Exit mobile version