NTV Telugu Site icon

CM YS Jagan: నేడు కుప్పంలో సీఎం జగన్‌ పర్యటన

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.. ఉదయం 10.25 గంటలకు రాజుపేట్, రామకుప్పం మండలం హెలిప్యాడ్‌ చేరుకోనున్న ఆయన.. 10.40 గంటలకు హెచ్ఎన్ఎస్ఎస్ నీరు విడుదల సందర్భంగా పూజా కార్యక్రమం చేస్తారు.. 10.45 గంటలకు హెచ్ ఎన్ ఎస్ ఎస్ నీరు విడుదల చేస్తారు.. 11.25 గంటలకు శాంతిపురం మం, గుండిశెట్టిపల్లి వద్ద హెలిప్యాడ్‌కు చేరుకోనున్న ఆయన.. ఉదయం 11.40 గంటలకు గుండిశెట్టి పల్లి వద్ద బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. సీఎం తన పర్యటనలో.. తాగు, సాగునీటి కోసం దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చనున్నారు. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4.02 లక్షల జనాభాకు త్రాగు నీరు అందిస్తూ.. అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560.29 కోట్ల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి, కుప్పం నియోజకవర్గానికి నేడు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు సీఎం జగన్‌.

Read Also: PM Modi: దేశ వ్యాప్తంగా 553 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు.. రూ.169 కోట్లతో తెలంగాణలో 15..!

కుప్పం బ్రాంచి కెనాల్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 207.80 కిలోమీటర్ల వద్ద (చిత్తూరు జిల్లా పెద్ద పంజాణీ మండలం అప్పినపల్లె చెరువు వద్ద) కుప్పం బ్రాంచ్ కెనాల్ ప్రారంభిస్తారు.. దీని నీటి సామర్థ్యం : 6.130 క్యూమెక్స్ కాగా.. కాలువ పొడవు : 123.641 కిలోమీటర్లు.. రూ. 560.29 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు.. కట్టడాలు : 330, లిఫ్ట్ లు: 3, ఆయకట్టు : 110 చెరువుల క్రింద 6,300 ఎకరాలుగా ఉంది.. ఇక, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు చెందిన 4.02 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించనున్నారు.