YSR Cheyutha: ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వైఎస్సార్ చేయూత నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు. అనకాపల్లి సభలో బటన్ నొక్కి మహిళల ఖాతాలో 18 వేల 750 చొప్పున జమ చేస్తారు. వైఎస్సార్ చేయూత కింద అర్హులైన ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి 18 వేల 750 చొప్పున.. వారి ఖాతాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్న విషయం విదితమే.. మొత్తం 31 లక్షల మందికిపైగా లబ్ధిదారులు ఉన్నారు. అయితే, ఈ సారి అనకాపల్లి వేదికగా ఈ కార్యక్రమం జరగబోతోంది. ఇక, సీఎం పర్యటన దృష్ట్యా.. అనకాపల్లి జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు..
Read Also: Enumamula Market: వరంగల్ ఎనమాముల వ్యవసాయ మార్కెట్‌కు 3 రోజులు సెలవు
సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో.. అనకాపల్లిలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భారీ వాహనాలు మళ్లించినట్టు పోలీసులు ప్రకటించారు. విశాఖపట్నం నుండి తుని వైపు వెళ్లే వాహనాలు లంకెలపాలెం జంక్షన్ – పరవాడ – అచ్యుతాపురం – ఎలమంచిలి – రేగుపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా తుని చేరుకోవాలని సూచించారు. ఇక, తుని నుంచి విశాఖపట్నం వైపు వాహనాలు వెళ్లేందుకు తుని – రేగుపాలెం జంక్షన్ – ఎలమంచిలి బైపాస్ – అచ్యుతాపురం – పరవాడ – లంకెలపాలెం జంక్షన్ జాతీయ రహదారి మీదుగా విశాఖపట్నం చేరుకోవాలని స్పష్టం చేశారు పోలీసు అధికారులు.
Read Also: IND vs ENG Test: నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ ఐదో టెస్టు.. అశ్విన్, బెయిర్‌స్టోకు ప్రత్యేకం!
ఇక, అనకాపల్లి పర్యటన కోసం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్న సీఎం వైఎస్ జగన్.. ఉదయం 10.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి.. 10.45 గంటలకు కశింకోట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11.15 గంటలకు పిసినికాడ చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు ఏపీ సీఎం.. 11.40 గంటల నుంచి సుమారు గంటసేపు ప్రసంగించిన అనంతరం.. అదే వేదిక నుంచి బటన్ నొక్కి వైఎస్సార్ చేయూత చివరి విడత నిధుల పంపిణీని ప్రారంభిస్తారు. ఆ తర్వాత మహిళామార్ట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేస్తారు ముఖ్యమంత్రి.. ఆ తర్వాత మధ్యాహ్నం 12.55 గంటలకు బయలుదేరి కశింకోటలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 1.05 నుంచి 2.05 గంటల వరకు ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమాశం కానున్నారు.. 2.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన.. 2.35 గంటలకు విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. ఆ తర్వాత తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్.