Site icon NTV Telugu

CM YS Jagan: రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం పర్యటన.. గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. సంతబొమ్మాళి మండలం మూలపేటకు వెళ్లనున్న ఆయన.. మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేయనున్నారు. ఇక, మూలపేట పర్యటన కోసం.. బుధవారం ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరనున్నారు సీఎం.. ఉదయం 10.30 గంటలకు మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేస్తారు.. గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్ధాపన చేయనున్నారు ఏపీ సీఎం.. ఇక, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌, హిరమండలం వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు శంకుస్ధాపన చేస్తారు.. మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు.. శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగించుకుని తిరిగి మధ్యాహ్నం 3.25 గంటలకు తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read Also: Andhra Pradesh: సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఉత్తర్వులు జారీ

కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావనపాడు పోర్టుకు మూలపేట పోర్టుగా నామకరణం చేసింది. ఏప్రిల్ 19న గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ములపేట, విష్ణుచక్రం గ్రామాల రైతులు ప్రతిపాదిత పోర్టు ప్రాంతంలో భావనపాడు గ్రామం పరిధి లేదని, ముల్పేటలోని అన్ని భూములను పరిగణనలోకి తీసుకుని పేరు మార్చాలని కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు (ఓడరేవులు) స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికల్ వలవెన్ తెలిపారు. అందుకే, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, భావనపాడు పోర్టుకు మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్‌గా పేరు మార్చడానికి ప్రతిపాదనలు పెట్టారు, మొత్తం భూమి మరియు ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలు మూలపేట మరియు విష్ణుచక్రం గ్రామాలకు చెందినవి మరియు భావనపాడు కాదు అని ఒక ప్రకటనలో తెలిపారు.

Exit mobile version