NTV Telugu Site icon

YS Jagan: జూన్ 4న ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుంది: వైఎస్‌ జగన్‌

Ys Jagan

Ys Jagan

CM YS Jagan Said Nation will be shocked to see the AP Elections Results on June 4: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సీఎం వైఎస్‌ జగన్‌ తొలిసారి స్పందించారు. ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ తాము అధికారంలోకి రాబోతున్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోందన్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించలేనన్ని సీట్లు తాము సాధించబోతున్నామని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

ఐప్యాక్ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ… ‘ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయం. మేం మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి అంతకంటే ఎక్కువ సీట్లే గెలుస్తాం. జూన్‌ 4న రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్‌ అవుతుంది. ఫలితాల తర్వాత దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుంది. ప్రశాంత్‌ కిషోర్‌ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయి. వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేస్తాం. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుంది’ అని అన్నారు.

Also Read: Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌!

గురువారం మధ్యాహ్నాం బెంజిసర్కిల్‌లో ఉన్న ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (ఐప్యాక్) ప్రతినిధులతో సీఎం వైఎస్‌ సమావేశమయ్యారు. సుమారు 25 నిమిషాల పాటు ఐప్యాక్ కార్యాలయంలో సీఎం ఉన్నారు. ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కోసం పొలిటికల్‌ కన్సల్టెన్సీగా ఐప్యాక్‌ పని చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో తమ పార్టీ కోసం పనిచేసినందుకు ఐప్యాక్ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు చెప్పారు.