NTV Telugu Site icon

CM YS Jagan: రోడ్ల నాణ్యతపై మరింత దృష్టి.. ఏడాదికే రిపేరు చేయాల్సిన పరిస్థితి రావొద్దు..!

Ys Jagan

Ys Jagan

రోడ్ల నాణ్యతపైనా మరింత దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్‌.. వేసిన మరుసటి సంవత్సరమే మళ్లీ రిపేరు చేయాల్సిన పరిస్థితి రాకూడదన్నారు.. ఇంజినీర్లు వీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష సందర్భంగా ఉపాధి హామీపై కూడా సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాథి హామీలో భాగంగా ఈ ఏడాది 1500 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.. ఇప్పటి వరకూ 215.17 లక్షల పని దినాల కల్పన జరిగింది.. పని దినాల రూపంలో రూ. 5280 కోట్ల రూపాయలు ఉపాధి హామీ కింద ఖర్చు చేయాలని లక్ష్యంగా ఉండాలన్నారు.. మెటీరియల్‌ రూపంలో రూ.3520 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి అనేది టార్గెట్‌.. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8800 కోట్లు ఖర్చు చేయాలని ఆదేశించారు.

Read Also: MP Dharmapuri Arvind : రైతుల ఆత్మహత్యలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది

ఇక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష సందర్భంగా.. మహిళల స్వయం సాధికారిత కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు సీఎం జగన్‌.. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాల ద్వారా వారికి జీవనోపాధి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలన్న ఆయన.. చేయూత కింద అర్హత సాధించిన లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్ల పాటు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల కింద నిర్ణయించిన వ్యవధి మేరకు ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు.. ఈ డబ్బు వారి జీవనోపాధికి ఉపయోగపడేలా ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకుల సహాయంతో స్వయం ఉపాధి మార్గాలను అమలు చేస్తోందన్న ముఖ్యమంత్రి… దీన్ని మరింత విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు పథకాన్ని అందుకునే మొదటి ఏడాది నుంచే వారిని స్వయం ఉపాధి మార్గాలవైపు మళ్లించే కార్యక్రమాలను మరింత పెంచాలన్నారు.. గ్రామ స్థాయిలో సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా వేగంగా అడుగులు పడతాయన్న సీఎం.. అర్హులైన మహిళల్లో మరింత అవగాహన కల్పించి బ్యాంకుల నుంచి కూడా రుణాలు ఇప్పించి ఉపాధి కల్పించే మార్గాలను సమర్థవంతంగా కొనసాగించాలన్నారు. మహిళలు తయారు చేస్తున్న వస్తువులు, ఉత్పాదనలకు సంబంధించి మంచి మార్కెట్‌ వ్యవస్ధ ఉండాలని స్పష్టం చేశారు. దీనికోసం బహుళజాతి కంపెనీలతో అనుసంధానం కావాలన్నారు.

Read Also: Bhola Shankar: మెగాస్టార్ సినిమా డబ్బింగ్ వర్క్స్ షురూ…

45-60 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల సాధికారతే లక్ష్యంగా చేయూత పథకం అమలు చేస్తున్నట్టు వెల్లడించారు సీఎం జగన్.. జిల్లాకు రెండు సూపర్‌ మార్కెట్‌ల ఏర్పాటు చేయాలి.. మొత్తం 27 చేయూత మహిళా మార్టులు ఏర్పాటు చేయాలన్న ఆయన.. ఒక్కో సూపర్‌ మార్టులో కనీసం నెలకు రూ.30 లక్షలు టర్నోవర్‌ లక్ష్యంగా ఏర్పాటు చేయాలని.. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు డోర్ డెలివరీ, ఆన్‌లైన్ బుకింగ్‌, వాట్సప్ బుకింగ్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ట్రెండ్స్, అజియో వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకోనున్నట్టు తెలిపారు. చిత్తూరు జిల్లా కురుబల కోటలో చింతపండు ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తామని.. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 3వేల కుటుంబాలకు చేయూత అందిస్తామన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.