Site icon NTV Telugu

CM YS Jagan: వారికి శుభవార్త.. ఈ రోజే ఖాతాలో సొమ్ము జమ

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది.. ఇక, ఇప్పుడు అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఏటా రెండు పర్యాయాలు జనవరి- జూన్, జూలై- డిసెంబర్ వరకు అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి మిగిలిపోయిన వారికి డిసెంబర్ / జనవరిలో కొంత సొమ్మును ఇస్తూ వస్తున్నారు.. ఆగస్టు- డిసెంబర్, 2023 మధ్య అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని 68,990 అర్హులకు లబ్ధి చేకూర్చాలని సీఎం నిర్ణయించారు.. వారికి ఖాతాల్లో 97.76 కోట్ల రూపాయలు జమ చేసి వారికి ప్రయోజనం కలిగించనున్నారు.. ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరగనున్న కార్యక్రమంలో.. బటన్‌ నొక్కి వర్చువల్ గా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమచేయనున్నారు. దీంతో.. మరో 68,990 మందికి నేడు సంక్షేమ ఫలాలు అందనున్నాయి.. ఇప్పటికే గత 55 నెలల్లో డీబీటీ రూపంలో అందించిన ఆర్థిక సాయం రూ.2,46,551 కోట్లుగా ఉన్న విషయం విదితమే.

Read Also: Mahesh Babu: ఇది బాబు లాస్ట్ రీజనల్ సినిమా… తర్వాత దద్ధరిల్లిపోద్ది

Exit mobile version