రాష్ట్ర వ్యాప్తంగా చిరువ్యాపారులకు చేయూతనందించడానికి సీఎం జగన్ ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ నిధులను విడుదల చేసారు సీఎం జగన్. ఈ పథకం ద్వారా 5,10,412 మంది లబ్ధిదారులకు రూ.10వేలకు పైబడి రుణాలు అందజేశారు. రూ. 11.03 కోట్ల వడ్డీ రియంబర్స్‌మెంట్‌తో కలిపి రూ.560.73 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు సీఎం జగన్. ఇప్పటి వరకూ చిరువ్యాపారులకు రూ. 2,955.79 కోట్ల రుణాలు అందజేసింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పటి వరకూ ప్రభుత్వం చెల్లించిన వడ్డీ రూ.74.69 కోట్లు. అయితే.. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా ఇన్ని లక్షలమందికి ఈ రకంగా మంచి చేయడం లేదన్నారు. ఇన్ని లక్షలమంది చిరువ్యాపారులకు ఎక్కడా ఇంత మేలు జరడం లేదని, దేశం మొత్తం ఇస్తున్న రుణాలు కంటే ఆంధ్ర రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య అంతకన్నా ఎక్కువ ఉందని ఆయన వెల్లడించారు. ఈ పథకాన్ని పగడ్బందీగా నడుపుతున్న బ్యాంకర్లు, సచివాలయాల వ్యవస్థ, మెప్మా.. తదితర శాఖలకు అభినందనలు తెలిపారు సీఎం జగన్. పేదవాడికి మంచి జరిగించే యజ్ఞం సత్ఫలితాలను ఇస్తోందని, ఇంతవరకూ 15.87 లక్షలమంది చిరువ్యాపారులకు మంచి జరిగిందన్నారు.
Also Read : Evergrande : 300బిలియన్ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిన చైనా రియల్ ఎస్టేట్ కంపెనీ
హస్తకళాకారులకూ ఈ పథకం ద్వారా మేలు జరిగిందని, ఈ విడతలో 5,10,412 మందిలో 4.54లక్ష లమంది సకాలంలో రుణాలు చెల్లించి…, మళ్లీ రూ.10వేలు, ఆపైన రుణాలుగా అందుకుంటున్నారని ఆయన తెలిపారు. సకాలానికి కట్టిన వారికి ఇచ్చే రుణాలు రూ.౧౦ వేల నుంచి రూ.13వేల వరకూ పెంచారని, ఇంతవరకూ 15.87 లక్షలమంది చిరువ్యాపారులకు రూ. 2,955.79 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. వీరిలో తిరిగి చెల్లించి.. మళ్లీ మళ్లీ రుణాలు పొందిన వారు దాదాపుగా 13.29 లక్షల మంది ఉన్నారని, ఇప్పటివరకూ వీరితరఫున ప్రభుత్వం చెల్లించిన వడ్డీ రూ.74.69 కోట్లు అని ఆయన తెలిపారు.
Also Read : Baby: తన తమ్ముడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ..
అంతేకాకుండా.. ‘చిరు వ్యాపారులు సమాజ సేవ చేస్తున్నారు. ఒకరి మీద ఆధారపడకుండా… వారు జీవనోపాధిని వారు చూసుకుంటున్నారు. అవకాశం వస్తే మరో ఒకరిద్దరికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అందుకనే వారికి తోడుగా నిలబడాలన్న ఆలోచన చేయాల్సి వచ్చింది. చేతివృత్తుల వారికీ పథకం వర్తిస్తోంది. రూ.10వేల రుణంతో ఈ కార్యక్రమం మొదలైతే.., క్రమం తప్పకుండా చెల్లించేవారికి మరుసటి ఏడాది వేయి పెంచమని, ఆతర్వాత ఏడాది మరో వేయి పెంచమని, రూ.13వేల వరకూ ఇవ్వమని చెప్పాం. పాదయాత్రలో స్వయంగా నేను కళ్లారా చూశారు.. చిరు వ్యాపారుల కష్టాలుచూశాను. వారిలో కలిసి మాట్లాడ్డం జరిగింది. వేయి రూపాయలు రోజుకు రుణం ఇస్తే.. వంద కట్ చేసుకుని, సాయంత్రానికి మళ్లీ వేయి రూపాయలు తీసుకునే పరిస్థితులు ఉండేవి. అలాంటి వారికి వ్యాపారాలు చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. పెట్టుబడి వారికి పుట్టేది కాదు. రూ.10ల వడ్డీకి కూడా రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి.
ఈ పరిస్థితులన్నీ మార్చాలన్న ఉద్దేశంతో జగనన్న తోడు పథకం పుట్టింది. జగనన్న తోడుద్వారా లబ్ధిపొందిన వారిలో 80శాతం అక్క చెల్లెమ్మలే. లబ్ధిదారుల్లో 80 శాతం మంది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు చెందిన వారే ఉన్నారు. సామాజికంగా అట్టడుగున్న ఉన్న వారికి ఈపథకం ఉపయోగపడుతుంది. ఈకార్యక్రమం ద్వారా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ఎవరికైనా ఈ పథకం వర్తించని పరిస్థితి ఉంటే.. వెంటనే సచివాలయ వ్యవస్థను సంప్రదించండి. అక్కడున్న సిబ్బంది మీకు తోడుగా నిలుస్తారు. వాలంటీర్లను కోరినా.. వారు దరఖాస్తు చేయడంలో మీకు తోడుగా నిలుస్తారు. లేదా 1902 నంబర్‌కు ఫోన్ చేసినా.. పథకాన్ని మీకు అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడతారు. ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే ప్రభుత్వం తపన పడుతోంది.’ అని సీఎం జగన్ అన్నారు.