NTV Telugu Site icon

Ramzan 2024: మేమంతా సిద్ధం యాత్రకు మళ్లీ బ్రేక్‌.. రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం..

Cm Jagan

Cm Jagan

Ramzan 2024: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు మళ్లీ బ్రేక్‌ పడింది.. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన బస్సు యాత్రకు.. మొన్నటికిమొన్న ఉగాది సందర్భంగా విరామం ఇవ్వగా.. ఈ రోజు ముస్లింలు రంజాన్‌ జరుపుకుంటున్న సందర్భంగా మరోసారి బ్రేక్‌ ఇచ్చారు.. ఇక, నేడు రంజాన్‌ కారణంగా సీఎం వైఎస్‌ జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్‌ పడడంతో.. నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీకానున్నారు వైసీపీ అధినేత.. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన ఎన్నికల ప్రచార వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు.

Read Also: Rain Alert: తెలంగాణ ప్రజలకు చల్లటికబురు.. నేడు, రేపు తేలికపాటి వర్షాలు!

మరోవైపు.. రంజాన్‌ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులు, సోదరీమణులకు ‘ఈద్‌ ముబారక్‌’ చెప్పారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.. రంజాన్‌ సందర్భంగా దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ, వంటి సత్కార్యాల ద్వారా అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని ఆకాక్షించారు.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్‌ అని పేర్కొన్నారు.. పవిత్ర ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక… ఆ అల్లాహ్‌ దీవెనలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Read Also: Janvikapoor : జాన్వీ కపూర్ లో ఈ టాలెంట్ కూడా ఉందా?

కాగా, బుధవారం 12రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో దూకుడుగా ముందుకుసాగారు సీఎం జగన్‌.. గంటావారిపాలెం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ దగ్గరకు చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకోనున్నారు. ఆ తర్వాత కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా వెళ్లి అయ్యప్పనగర్ బైపాస్ లో నిర్వహించిన బహరంగ సభలో ప్రసంగించారు.. ఆ తర్వాత కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ళ దగ్గర రాత్రి బస చేసే శిబిరానికి చేరుకోవడంతో… 12వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసింది.. ఈ రోజు రంజాన్‌ కారణంగా బ్రేక్‌ పడడంతో.. శుక్రవారం రోజు 13వ రోజు యథావిథిగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగనుంది.