Site icon NTV Telugu

Christmas Celebrations: బెజవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు.. ముఖ్యఅతిధిగా సీఎం జగన్‌

Christmas Celebrations: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.. సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్రైస్తవ మతపెద్దలతో కలిసి కేక్ కట్ చేశారు. అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం వైఎస్‌ జగన్‌. అయితే, బెజవాడలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఇక, ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. శత్రువుల పట్ల కూడా క్షమాగుణం కలిగి ఉండాలని.. ఏసుక్రీస్తు సందేశం ఇచ్చారు అని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కొవ్వుత్తులు వెలిగించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Exit mobile version