Site icon NTV Telugu

CM JaganMohanReddy: తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం

Jagan Viswa1

Jagan Viswa1

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివి నుంచి మరో తార భువికి వెళ్ళిపోయింది. ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ ఈ రోజు (గురువారం రాత్రి) తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అపోలో ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో తీవ్రసంతాపం తెలిపారు. విశ్వనాథ్‌గారి మరణం తీవ్ర విచారానికి గురిచేసింది.తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌గారు.ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. దివంగత వైఎస్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును కళా తపస్వి కె.విశ్వనాథ్ కి అందించిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు.

Read Also: Vladimir Putin: ఉక్రెయిన్‌కు ఆయుధాల పంపిణీ.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!

కళా తపస్వి , దర్శక దిగ్గజం శ్ర కె.విశ్వనాథ్ గారి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ. కళా తపస్వి, దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్ గారి మరణం పట్ల బీసీ సంక్షేమ, సమాచార మరియు సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు సంతాపం వ్యక్తం చేశారు…భారతీయ సంస్కృతిక సంప్రదాయాలను, సంగీత సాహిత్యలను తన సృజనాత్మకమైన మార్క్ తో తెలుగు తెరపై ఆవిష్కరించిన కళా తపస్వి కె.విశ్వనాథ్ గారని మంత్రి అన్నారు.

ఆయన తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించడంతో పాటు 50 పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారన్నారు.ఆయన దర్శకత్వం వహించిన ఆత్మగౌరవం అనే మొదటి సినిమా ఆరోజుల్లో నంది అవార్డు దక్కించుకుందని.ఆయన రూపొందించిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగరసంగమం వంటి సినిమాలు తెలుగు సినిమా చరిత్రకు ఓ మైళ్ళ రాళ్ళని మంత్రి తెలియజేశారు… అలాంటి దర్శక దిగ్గాజాన్ని కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరనిలోటని మంత్రి అన్నారు…ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరలని కోరుకుంటూ…వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

Read Also: K Vishwanath : సంగీతసాహిత్యాలతోనే విశ్వనాథుని తపస్సు!

Exit mobile version