Site icon NTV Telugu

CM YS Jagan: ప్రధానితో ముగిసిన సీఎం జగన్‌ భేటీ..

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: హస్తిన పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బిజీ బిజీగా గడుపనుతున్నారు.. కాసేపటి కిత్రమే ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన సమావేశం ముగిసింది.. ప్రధానితో నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 1.20 గంటలకు పైగా సాగింది.. ప్రధాని మోడీతో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు సీఎం జగన్‌.. పోలవరం ప్రాజెక్టుకు తక్షణమే రూ.12,911 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక, అంతకుముందే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశమైన సీఎం జగన్.. దాదాపు 45 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు.. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించినట్లు తెలుస్తోంది.

Read Also: SBI Offer : రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రూ. 3 లక్షలు పొందే అవకాశం..

కాగా, ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్‌.. అక్కడి నుంచి హస్తినకు వెళ్లారు.. ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.. మొదట ఢిల్లీ­లోని జనపథ్‌–1 నివాసానికి చేరుకున్న సీఎం జగన్‌.. ఆ తర్వాత హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం అయ్యారు.. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు.. పోలవరం ప్రాజెక్ట్‌ నిధులపై కూడా అమిత్‌ షాతో మాట్లాడినట్టు తెలుస్తోంది.. ఇక, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. మరోవైపు.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

Exit mobile version