NTV Telugu Site icon

CM YS Jagan: రాష్ట్రంలో, కుప్పంలో చంద్రబాబుకి ఇల్లు లేదు.. పక్క రాష్ట్రంలోనే..!

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: రాష్ట్రంలో, కుప్పంలో కూడా చంద్రబాబుకి ఇల్లు లేదు.. పక్క రాష్ట్రం హైదరాబాద్ లో చంద్రబాబు ఇల్లు ఉందంటూ దుయ్యబట్టారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. సామర్లకోటలో సీఎం చేతుల మీదుగా సామూహిక గృహప్రవేశాలు జరిగాయి.. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ విపక్షంపై నిప్పులు చెరిగారు.. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం.. 22 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతుంది.. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల వైఎస్ ఆర్ జగనన్న కాలనీలు వస్తున్నాయి.. ఇళ్లు కాదు.. ఊళ్లు వస్తున్నాయని తెలిపారు.. పేదలకి ఇళ్లు ఇవ్వకుండా ఉండడానికి చంద్రబాబు కోర్టుకి వెళ్లాడని.. చంద్రబాబు వంటి దుర్మార్గుడు ఇళ్లను అడ్డుకున్నాడని మండిపడ్డారు.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

గత ప్రభుత్వానికి, మీ బిడ్డ (వైఎస్‌ జగన్‌)కి తేడా గుర్తించండి.. గత ప్రభుత్వంలో పేద వాడికి ఒక్క సెంట్ ఇచ్చిన పాపాన పోలేదు అన్నారు సీఎం జగన్‌.. చంద్రబాబుకి వేల కోట్లు సంపద ఉన్న కుప్పంలో కూడా పేదలకి ఒక్క సెంట్ స్థలం ఇవ్వలేదని.. కుప్పంలో 20 వేల ఇళ్ల పట్టాలు, 8 వేల ఇళ్ల నిర్మాణాలు జరిగాయని తెలిపారు. 35 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యే, మూడు సార్లు సీఎం అయినా.. కుప్పంలో మీ బిడ్డ సీఎం అయిన తరువాతనే మంచి జరిగిందన్నారు. కంటిన్యూ గా చంద్రబాబు రాష్ట్రంలో ఎప్పుడు అయినా కనిపించడా? అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రమే రాజమండ్రి లో చంద్రబాబు కనిపిస్తున్నాడు అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు, దత్తపుత్రుడు (పవన్‌ కల్యాణ్‌), కొడుకు (నారా లోకేష్‌, బావ మరిది (నందమూరి బాలకృష్ణ) రాష్ట్రంలో ఉండరు.. దోచుకోవడానికి మాత్రం రాష్ట్రం.. పంచుకోవడానికి వారికి హైదరాబాద్ కావాలి అంటూ హాట్‌ కామెంట్లు చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.