Site icon NTV Telugu

CM YS Jagan: నరసరావుపేట అసంతృప్త నేతలతో సీఎం జగన్‌ భేటీ.. ఆ హామీ నాది..!

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓవైపు అభ్యర్థులను ప్రకటిస్తూనే.. మరోవైపు.. అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలోపడిపోయింది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇక, ఈ రోజు నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన అసంతృప్త నేతలతో సమావేశం అవయ్యారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

Read Also: Congress: నారీమణులే లక్ష్యంగా కాంగ్రెస్ వరాలు.. ఎన్ని స్కీమ్స్ ఉన్నాయంటే..!

అయితే, ఈ సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వైపు నుంచి రాజకీయంగా ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం వైఎస్‌ జగన్ కు వివరించారట ఆరుగురు అసంతృప్త నేతలు.. మా రాజకీయ విశ్వసనీయతను దెబ్బతీసేలా ఎమ్మెల్యే గోపిరెడ్డి వ్యవహరిస్తున్నారని జగన్‌ దృష్టికి తీసుకెళ్లారట.. అయితే, ఇక ముందు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత తనదని ఈ సందర్భంగా హామీ ఇచ్చారట వైసీపీ అధినేత జగన్.. ఈ ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించేందుకు కలిసి పని చేయాలని నేతలకు సర్ది చెప్పారట.. కాగా, వైసీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ పై కసరత్తు చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. త్వరలోనే తుది జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు.. మరోవైపు.. సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ.. ఇప్పటికే ప్రతిపకాలపై తీవ్రస్థాయిలో సీఎం జగన్ విరుచుకుపడుతోన్న విషయం విదితమే.

Exit mobile version