NTV Telugu Site icon

CM YS Jagan: ప్రపంచ స్థాయి విద్యాబోధన టార్గెట్‌.. సీఎం కీలక ఆదేశాలు

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్‌ విద్యలో ఐబీ సిలబస్‌పై సమావేశంలో చర్చించారు.. ఈ లక్ష్యం దిశగా అడుగులు వేయాలని అధికారులను ఆదేశించారు.. ప్రపంచ స్థాయిలో విద్యాబోధనే లక్ష్యంగా అడుగులు వేయాలని స్పష్టం చేసిన సీఎం జగన్‌.. దీనికి ముందుగా విస్తృతంగా అధ్యయనం, కసరత్తు చేయాలన్నారు. ఉన్నత విద్య టీచింగ్, లెర్నింగ్‌లో ఏఐ వినియోగించాలన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read Also: Rk Roja: పవన్ కళ్యాణ్ అరిచి అరిచి గుండెపగిలి చచ్చిపోతాడేమో..

అయితే, ఉన్నత విద్యలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగంపై కార్యాచరణను సీఎం వైఎస్‌ జగన్‌కు ఈ సందర్భంగా వివరించారు అధికారులు. ఉన్నత విద్య విద్యార్థులకు కోర్సు చివరలో ఏఐ ప్రాథమిక అంశాలు బోధించే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఏఐపై పరిశోధన కోసం యూనివర్శిటీల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ల ఏర్పాటు చేయనున్నారు. బోధన, పరిశోధన, మూల్యాంకనంలో ఏఐ టూల్స్‌ వినియోగం ఉండేలా ప్రణాళికలు వేస్తున్నారు.. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ ఫౌండేషన్ కోర్సు తీసుకొచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. బైలింగువల్, డిజిటల్‌ కంటెంట్‌ రూపంలో కోర్సులు తీసుకురానున్నారు. ఏఐ, అప్లికేషన్ల వినియోగంలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ అభివృద్ధి చేస్తారు. యూనివర్శిటీలో మూడు రకాల జోన్లను అభివృద్ధి చేయనున్నారు. కంప్యూటర్‌ విజన్‌ జోన్, ఇమేజ్‌ ప్రాససింగ్‌ జోన్‌ మెటావర్స్‌ లెర్నింగ్‌ జోన్‌లు ఏర్పాటు చేయనున్నారు.

Read Also: Strange Customs: ఏపీలోని ఆ గ్రామంలో వింత ఆచారం.. వర్షాల కోసం పాండవుల వేషం వేసి..

మొత్తంగా పాఠశాల విద్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. ఒప్పందంపై తుది కసరత్తు చేస్తోంది పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్.. ఇంటర్నేషనల్ బాకలారేట్ సంస్థతో వచ్చే నెలలో ఎంవోయూ కుదుర్చుకోబోతోంది ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులను పోటీకి సిద్ధం చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఒకటో తరగతి నుంచి సీనియర్ ఇంటర్ విద్యార్ధులకు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు ఉండనున్నాయి.. సాంకేతిక నైపుణ్యం, జాతీయ, అంతర్జాతీయ భాషల్లో ప్రావీణ్యం ఉండేలా బోధనకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.. సుస్థిర ఉపాధి మార్గాలు ఏర్పాటయ్యేలా కొత్త విద్యా విధానం ఉండబోతోంది. నూతన విద్యా విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేలా ప్రభుత్వ ప్రణాళికలు రూపొందిస్తోంది.