NTV Telugu Site icon

CM YS Jagan: మూలపేట.. మూలనఉన్న పేట కాదు‌‌.. అభివృద్ధికి మూలస్తంభం…

Cm Ys Jagan

Cm Ys Jagan

తోడేళ్లన్నీ ఏకమైనా నాకేమీ భయం లేదు.. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా అని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్‌ జగన్‌.. నౌనాడలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. మూలపేట మూలన ఉన్న పేట కాదు‌‌.. అభివృద్ధికి మూలస్తంభం కానుందంటూ అభివర్ణించారు సీఎం జగన్‌.. 24 మిలియన్ టన్నులు సామర్థ్యంతో నాలుగు బెర్త్ లు‌ కేటాయిస్తున్నాం.. పోర్ట్ కోసం 2954 కోట్లు ఖర్చుచేసి 24 నెలల్లో పుర్తి చేస్తాం అన్నారు.. 14 కిలోమీటర్ల రహాదారులు , 11 కిలోమీటర్ల రైల్వే కనెక్టవిటీ అందిస్తున్నాం.. మౌళిక వసతులన్నింటితో కలిపి 4362 కోట్లు ఖర్చు పెడుతున్నాం అన్నారు. 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.. పోర్ట్‌ ఆదారిత పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు వస్తే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయన్నారు.. ఉపాధి లేఖ వేరేప్రాంతాలకు , వేరే రాష్ర్టాలకు మత్స్యారులు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. గంగపుత్రుల కళ్లలో ఆనందం నింపేందుకు చర్యలు చేపడుతున్నాం అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో మరో రెండు పిస్సింగ్ హార్బర్ నిర్మిస్తాం.. బుడగట్లపాలెం , మంచినీళ్లపేటలో హార్బర్ లు నిర్మిస్తున్నాం అని తెలిపారు సీఎం జగన్‌.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గిడిచినా నాలుగు పోర్టులే ఉన్నాయి.. నాలుగు పోర్టులు.. 10 ఫిషింగ్‌ హార్బర్లు, 3 పిస్ ల్యాండిగ్ సెంటర్ నిర్మిస్తున్నా. గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా.. అని నిలదీశారు.. డీప్ సీలో ఫిషింగ్‌ అవకాశాలు ఇస్తే వలసలు నివారించవచ్చన్న ఆయన.. దివంగత నేత వైఎస్ మరణం తరువాత సాగునీటి ప్రొజెక్టులు పూర్తి కాలేదన్నారు.. వంశధారలో 19 టిఎంసి ల నీటి నిల్వచేసే అవకాశం ఉంది. నేరడి బ్యారేజి కోసం ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడానన్న ఆయన.. 176 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నాం. తద్వారా రెండు పంటలకు నీరు అందిస్తామని ప్రకటించారు..

ఇక, ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే అన్ని జిల్లాల అభివృద్ధి చేస్తున్నాం అన్నారు సీఎం జగన్‌.. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన తపన అన్న ఆయన.. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు.. మిగతా వాళ్లంతా ఏకమవుతున్నారు.. అంతా ఏకమై నాతో చీకటి యుద్ధం చేస్తున్నారు.. రాష్ట్రంలో పెత్తందార్లకు, పేదల పక్షాన నిలబడిన నాకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.. ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతున్నారు.. అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.. వాళ్లలా అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదన్న సీఎం.. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం మీరే.. ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరే అన్నారు. ప్రాంతాల చరిత్ర మార్చాలన్న కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నాం… ఉత్తరాంధ్ర , రాయలసీమ , కొస్తాంధ్రలో ఇంటి ఇంటి చరిత్రను మారుస్తుందన్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.