Site icon NTV Telugu

CM YS Jagan: సీఎం జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎమ్మెల్యేలు నన్ను తిట్టుకుని ఉండొచ్చు..!

Jagan 2

Jagan 2

CM YS Jagan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ప్రారంభంలో కొంతమంది ఎమ్మెల్యేలు నన్ను తిట్టుకుని ఉండొచ్చు.. వైఎస్‌ జగన్ ఏంటి..? ఇలా తిరగమంటున్నాడు..? అని అనుకుని ఉండొచ్చు.. కొంత బాధ కూడా పడి ఉండొచ్చు.. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరి ముఖాల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాయకులు నిరంతరం ప్రజల్లో ఉన్న పార్టీ కేవలం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే అన్నారు.. అందుకే ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు సీఎం జగన్‌.. ఇక, ఈ సభకు రాలేకపోయిన వారందరూ నా దళపతులే.. ప్రజలతోనే మన పొత్తు.. నా నమ్మకం, నా ధైర్యం మీరే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు.. పార్టీ శ్రేణులకు వరుసగా కార్యక్రమాల షెడ్యూల్ ప్రకటించారు సీఎం జగన్‌.. జనవరి 1 నుంచి మరో మూడు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి.. జనవరి 1 నుంచి వృధ్ధాప్య పెన్షన్ పెంపు.. పది రోజుల పాటు పెన్షన్ పెంపు సంబరాలు.. రెండో కార్యక్రమం వైఎస్సార్ చేయూత.. జనవరి 10 నుంచి జనవరి 20 వరకు.. ఐదు వేల కోట్ల రూపాయలను మహిళల ఖాతాల్లో వేస్తాం.. ఈ ఒక్క పథకం ద్వారా ఇప్పటి వరకు మహిళలకు 19వేల కోట్లు ఇచ్చినట్లు అవుతుంది.. పది రోజుల పాటు సంబరాలు.. మూడవ కార్యక్రమం వైఎస్సార్ ఆసరా.. జనవరి 20 నుంచి 30 వరకు వైఎస్సార్ ఆసరా.. ఫిబ్రవరిలో మ్యానిఫెస్టోను ప్రజలకు తీసుకుని వెళ్ళే కార్యక్రమం .. మార్చి నెలలో ఎన్నికలకు సన్నద్ధం అంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.

Exit mobile version