Tourist Police Stations: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఇప్పటికే ప్రజల రక్షణ కోసం.. ముఖ్యంగా మహిళలు, యువతుల భద్రత కోసం ప్రత్యేక చర్యలకు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఇప్పుడు పర్యాటకుల భద్రతే లక్ష్యంగా మరో ముందడుగు వేసింది.. పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఏపీ వ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్‌లను ప్రారంభించారు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇవాళ జెండా ఊపి వర్చువల్‌గా కొత్త టూరిస్ట్ పీఎస్‌లను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రయం చేపట్టినట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని.. పోలీసులు మీ స్నేహితులే అనే భావనను తీసుకురాగలిగామని, ఇంతకుముందు జరగని రీతిలో పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు..
Read Also: Valentines Day 2023: ముద్దుల్లో రకాలు.. వాటి అర్థాలు తెలుసా?
ఇక, పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్టులు పెట్టి తోడుగా నిలిచే కార్యక్రమం చేపట్టామని తెలిపారు సీఎం జగన్.. పర్యాటకుల భద్రత కోసమే ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న ఆయన.. 20 పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించినట్లు తెలిపారు. యాత్రికులు నిర్భయంగా పర్యాటక ప్రదేశాల్లో గడిపేందుకు ఈ పోలీస్ స్టేషన్లు ఉపయోగపడతాయని వెల్లడించారు.. మరోవైపు.. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన టూరిస్ట్ పోలీస్ బూత్ ను కూడా వర్చువల్‌గా ప్రారంభించారు సీఎం జగన్.. పోలీస్ బూత్‌తోపాటు 10 ద్విచక్ర వాహనాలు, రెండు పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు. మొత్తంగా టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు.. పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్‌లకు అదనపు భద్రత కల్పిస్తాయని చెబుతున్నారు అధికారులు..